Gold Rate Down today: పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. వరుసగా నాలుగో రోజూ భారీగా పడిపోయాయి. ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ధరలు భారీగా పడిపోతుండడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారు. దీంతో ధరలు భారీగా పెరుగుతుంటాయి. కానీ, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇనాలుగు రోజుల్లోనే తులం బంగారం రూ. 12 వేల వరకు దిగివచ్చింది. ప్రధానంగా అమెరికా డాలర్ బలపడడం, ఫెడ్ వడ్డీ రేట్లను యథతాథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేయడం పసిడి ధరలు దిగివచ్చేందుకు కారణమవుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడిదారులు బంగారం నుంచి బాండ్ ఈల్డ్స్ వైపు మళ్లుతున్నారు. అలాగే డాలర్ విలువ పెరగడంతో బంగారానికి గిరాకీ తగ్గుతోంది. దీంతో ధరలు దిగివస్తున్నాయి. ప్రస్తుతం హైదరబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లుగ్లోబల్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పెడిపోతున్నాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 108 డాలర్ల మేర పడిపోయింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4494 డాలర్ల వద్దకు దిగివచ్చింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 4.52 శాతం మేర పడిపోయింది. దీంతో ఔన్స్ వెండి రేటు 68.02 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరఈ నాలుగు రోజుల్లో తులం బంగారం రేటు రూ.12 వేలకు పైగా తగ్గింది. ఈరోజు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 2940 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం ధర రూ.1,45,970 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు రూ. 2750 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,33,800 వద్దకు దిగివచ్చింది. రూ.10 వేలు తగ్గిన వెండిబంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగా పడిపోతోంది. కిలో వెండి రేటు గత నాలుగు రోజుల్లో రూ.30 వేలు తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేల దిగివచ్చింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.2,50,000 స్థాయికి పడిపోయింది. ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి చూసుకుంటే కిలోకు రూ. 1.50 లక్షల వరకు తగ్గడం గమనార్హం. పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి ధరలు మారిపోవచ్చు. కొనుగోలుదారులు స్థానికంగా ఉండే ధరలను తెలుసుకోవడం మంచిది.