ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్ మూలపేట పోర్టుకు కేంద్రం శుభవార్త.. భూములు కేటాయింపు..

Wait 5 sec.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ ఛేంజర్ ప్రాజెక్టు అయిన తుది దశకు చేరుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణం జరుగుతోంది. పనులు తుది దశకు చేరుకోగా.. తాజాగా మూలపేట పోర్టుకు కేంద్రం నుంచి శుభవార్త అందింది. పోర్టు అభివృద్ధిలో భాగంగా రోడ్డు, రైలు అనుసంధానం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా భూమి కేటాయించింది. వద్ద మౌలిక వసతుల కోసం 385 ఎకరాల భూమి అవసరం కాగా.. ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అనుమతులు జారీ చేశారు. నౌపాడ సాల్డ్ ఫ్యాక్టరీ వద్ద 385.24 ఎకరాల సాల్ట్ ల్యాండ్‌ను ఏపీ మారీటైమ్ బోర్డుకు అప్పగిస్తూ అనుమతులు మంజూరు చేశారు. ఈ విషయాన్ని పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా తెలిపారు. శ్రీకాకుళం వాసులు, ఉత్తరాంధ్ర ప్రజల తరుఫున కేంద్రానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి పీయూష్ గోయెల్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు సుమారుగా 75 శాతం వరకూ పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నవంబర్ నెలాఖరు నాటికి మిగతా పనులు పూర్తి చేసి.. కార్యకలాపాలు ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం జరుగుతోంది. మొదటి దశలో 1500 ఎకరాల్లో పోర్టు నిర్మా్ణం జరుగుతోంది. ఇందుకోసం రూ. 4361 కోట్లు ఖర్చు చేయనున్నారు. మూలపేట పోర్టు నిర్మాణం పూర్తి అయితే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వాసులకు ఉపయోగకరంగా ఉండనుంది. పోర్టుకు అనుసంధానంగా కంపెనీలు వచ్చే అవకాశం ఉండటంతో స్థానికులకు ఉపాధి దక్కనుంది. దీంతో పోర్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా.. కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని స్థానిక యువత ఎదురు చూస్తున్నారు.