పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేలా కాల్పుల విరమణకు సంబంధించి రెండు మధ్యవర్తిత్వ దేశాలు చేసిన ప్రతిపాదనలను తమ తిరస్కరించారని ఓ ఇరాన్ సీనియర్ అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం వెలువరించింది. సుప్రీం లీడర్‌గా ఎన్నికైన తర్వాత విదేశాంగ విధానంపై నిర్వహించిన తన తొలి సమావేశంలో.. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కఠిన వైఖరిని ఖమేనీ వ్యక్తం చేశారని ఆ అధికారి పేర్కొన్నట్టు తెలిపింది. అయితే, ఆ సమావేశాలకు ఖమేనీ స్వయంగా హాజరయ్యారా? లేదా? అనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదని పేర్కొందిసుప్రీం లీడర్‌గా ఎన్నికైన తర్వాత గతవారం తొలి ప్రకటన విడుదల చేసిన .. యుద్ధంలో ప్రతి ఒక్కరి మరణానికి ఇరాన్ బదులు తీర్చుకుంటుందని, శత్రువు నుంచి పరిహారం వసూలు చేస్తుందని శపథం చేశారు. అందుకు వాళ్లు నిరాకరిస్తే వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లేదా ధ్వంసం చేయడం జరుగుతుందని ఆయన తేల్చిచెప్పారు. ‘‘ఈ ప్రతీకారంలో కొంత భాగం ఇప్పటివరకు ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంది... కానీ అది పూర్తిగా నెరవేరే వరకు, ఇది మా ప్రాధాన్యతలలో ఒకటిగానే ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.ఇరాన్ ఎప్పటికీ వెనుకంజ వేయదని, పూర్తి బలంతో ప్రతిఘటిస్తుందని, కేవలం అయతుల్లా అలీ ఖమేనీకి మాత్రమే కాకుండా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పౌరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన అన్నారు. ‘‘అమరుల రక్తానికి సంబంధించిన ప్రతీకారాన్ని మేము మర్చిపోం’’ అని ఆయన పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడిన మోజ్తాబా ఖమేనీ.. ప్రస్తుతం రష్యాలో చికిత్స పొందుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వ్లాదిమిర్ పుతిన్ చికిత్స కోసం మోజ్తాబాను మాస్కో‌కు తరలించాలని ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియాన్‌కు ఫోన్ చేసి చెప్పినట్టు కువైట్ పత్రిక అల్-జరీదా నివేదించింది. పుతిన్ కాల్ తర్వాత గురువారం ఆయనను రష్యా సైనిక విమానంలో మాస్కోకు తరలించినట్టు పేర్కొంది. అయితే, ఈ నివేదికలను రష్యా తిరస్కరించనూ లేదా ఖండిచనూ లేదు. ఇటువంటి వాటిపై మేము మాట్లాడబోమని రష్యా అధ్యక్షుడు ప్రెస్ సెక్రెటరీ దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించారు. ఇక, తమ సైన్యం దాడిలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ హతమైనట్టు ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. అయితే, దీనిపై ఇరాన్ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.