Digital Payments: ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ నుంచే చాలా వేగంగా డబ్బులు పంపించే అవకాశం లభించింది. అయితే, ఇదే సమయంలో సైబర్ మోసాలు పెరిగాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్ పేమెంట్లను మరింత సురక్షితంగా మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ రూల్స్ అమలుకానున్నాయి. ముఖ్యంగా మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రక్రియలో రానున్నా మార్పులు వినియోగదారుల డబ్బుకు అదనపు రక్షణ కవచంలా మారనున్నాయి. మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరిఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని డిజిటల్ లావాదేవీలకు కనీసం రెండు రకాల భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. కేవలం ఒక పాస్‌వర్డ్ లేదా ఒక ఓటీపీ మాత్రమే కాకుండా అదనపు సెక్యూరిటీ లేయర్‌ను రిజర్వ్ బ్యాంక్ తప్పనిసరి చేసింది. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అంటే పాస్‌వర్డ్స్, పిన్ నంబర్స్, ఎస్ఎంఎస్ ఆధారిత ఓటీపీలు లేదా సాఫ్ట్‌వేర్ ఆధారిత అథెంటికేషన్ వంటివి అదనంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రతి ట్రాన్సా‌క్షన్‌కు ఒక ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ప్రత్యేకంగా జనరేట్ చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకులు హైరిస్క్ ట్రాన్సాక్షన్ల విషయంలో అదనపు తనిఖీలు చేయాలి. అదనపు భద్రతా లేయర్లుకొత్త రూల్స్ ప్రకారం వినియోగదారుడికి తెలిసిన విషయం పాస్‌వర్డ్ లేదా పిన్, ఓటీపీ లేదా కార్డు, బయోమెట్రిక్ లేదా ఫింగర్ ప్రింట్ వంటి ఈ మూడింటిలో కనీసం రెండు అంశాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది. పెరుగుతున్న ఫిషింగ్, ఆన్‌లైన్ మోసాల నుంచి సామాన్యులను రక్షించేందుకు ఈ కఠిన నిబంధనలు రూపొందించారు. హ్యాకర్లు ఒక భద్రతా కోడ్‌ను తస్కరించినా రెండో లేయర్ భద్రత వల్ల ట్రాన్సాక్షన్ పూర్తి చేయడం వారికి కష్టమవుతుంది. నోటిఫికేషన్లు, అలర్ట్స్ సమాచారం అందేలా బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు చర్యలు తీసుకోవాలి. ఆన్‌లైన్ వెబ్‌సైట్లు లేదా యాప్స్‌లలో కార్డు వివరాలను సేవ్ చేసేటప్పుడు టోకనైజేషన్ ప్రక్రియను మరింత పటిష్టం చేయనున్నారు. దీంతో మీ అసలు కార్డు వివరాలు వ్యాపారులకు తెలియకుండా గోప్యంగా ఉంటాయి. ఆటో డెబిట్ లేదా సబ్‌స్క్రిప్షన్ల విషయంలో వినియోగదారుడి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయకూడదు. ప్రతి పేమెంట్‌కు ముందు రిమైడర్ పంపాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకువస్తున్న ఈ కొత్త మార్పులు ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియను మరింత పటిష్ఠం చేస్తుంది. దీర్ఘకాలంలో వినియోగదారుల ఆర్థిక భద్రతకు ఎంతో మేలు చేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మీ బ్యాంకింగ్ యాప్స్ లేదా పేమెంట్ వాలెట్లలో ఈ కొత్త భద్రతా ఫీచర్లను రానున్నాయి. వాటిని గమనించి పేమెంట్లు చేయాలని వినియోగదారులకు బ్యాంకులు సూచిస్తున్నాయి.