పశ్చిమాసియాలో శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై తాము దాడులను ముగించే యోచనలో ఉన్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ క్రూడాయిల్‌పై విధించిన ఆంక్షలను ఇటీవలే తాత్కాలికంగా అమెరికా ఎత్తివేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరా స్తంభించిపోయి.. ప్రపంచ సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అటు,. దీంతో ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈల్లో చమురు, గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈద్ రోజున కూడా ఇరాన్ భీకర దాడులు కొనసాగించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఆందోళనకు గురిచేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌ వేదికగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై పోస్ట్ చేసిన ట్రంప్.. యుద్ధంలో తన లక్ష్యాలకు అమెరికా దగ్గరయ్యిందని తెలిపారు. ఈ క్రమంలో సైనిక చర్యలకు ముగింపు పలికే యోచనలో ఉన్నామని ఆయన అన్నారు. అలాగే, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరొలిన్ లెవిట్టీ కూడా ఈ అంశంపై ప్రకటన విడుదల చేశారు. తమ లక్ష్యాన్ని 4 నుంచి 6 వారాల్లో చేరుకుంటామని పెంటగాన్ అంచనా వేసినట్టు ఆమె చెప్పారు. ట్రంప్ పోస్ట్ పెట్టిన కాసేపటికే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. ‘పశ్చిమాసియాలో యుద్ధానికి రేపటితో మూడు వారాలు పూర్తవుతాయి.. అమెరికా సైన్యాలు తమ బాధ్యతలను చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాయి.. యుద్ధంలో రోజు రోజుకూ ఇరాన్ పాలకులు బలహీనపడుతున్నారు.. ఇకపై వారు అమెరికా, దాని మిత్రులను బెదిరించలేరు’ అని ఆమె తెలిపారు.ఇదిలా ఉండగా, అమెరికా వాణిజ్య శాఖ ఇరాన్ క్రూడాయిల్‌పై విధించిన ఆంక్షలను మార్చి 20 నుంచి నెల రోజుల పాటు తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ మినహాయింపు మార్చి 20కి ముందే ట్యాంకర్లలోకి చేర్చిన బ్రెంట్ క్రూడ్, పెట్రోలియం ఉత్పత్తులకు వర్తిస్తుందని తెలిపింది. ఏప్రిల్ 19 వరకూ ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లోకి 140 మిలియన్ బ్యారెళ్ల చమురు అందుబాటులోకి వస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ అంచనా వేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో బ్రెంట్ క్రూడ్ ధర శుక్రవారం 112.19 డాలర్లు దాటేసింది.ప్రపంచ చమురు, గ్యాస్‌లో 20 శాతం హర్మూజ్ జలసంధి ద్వారా జరుగుతోంది. కానీ, ఇరాన్ దీనిని నియంత్రించడంతో రవాణా స్తంభించడం, ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన అనేక దాడులతో ముడి చమురు ధరలను ఆకాశాన్నంటుతున్నాయి. సుదీర్ఘ సరఫరా అంతరాయాలు ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయనే భయాలతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి స్టాక్‌ మార్కెట్‌లు భారీ నష్టాలతో ముగిశాయి.