ఉద్యోగులూ కొత్త HRA రూల్స్ తెలుసా.. రెంట్ లక్ష దాటితే PAN మస్ట్, వివరాలు దాస్తే 200 శాతం పెనాల్టీ!

Wait 5 sec.

: ఆదాయపు పన్నులకు సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025, ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 అనేవి ఏప్రిల్ 1 నుంచి అమలవుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులపై నేరుగా ప్రభావం చూపించే చాలా నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపుల్లో (HRA) కీలకమైనది. ఈ హెచ్ఆర్ఏకు సంబంధించి రూల్స్ మారాయి. వచ్చే నెల నుంచి హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కి సంబంధించి 4 అంశాల్లో కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. మరి ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1.కుటుంబంలోని వ్యక్తికి రెంట్ చెల్లించడంచాలా మంది ఉద్యోగులకు తమ తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామికి ఇంటి అద్దె చెల్లించి హెచ్ఆర్ఏ మినహాయింపులు క్లెయిమ్ చేస్తుంటారు. ఇలాంటి వారు ఇకపై తమ ఇంటి యజమానితో ఉన్న సంబంధాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఫేక్ రెంట్ అగ్రిమెంట్లను నిరోధించేందుకు ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు. 2. రెంట్ ఏడాదికి రూ.1 లక్షపైన ఉంటేడబుల్, ట్రిపుల్ బెడ్‌ రూమ్ రెంటు ఏడాదికి రూ. 1 లక్ష పైన ఉంటుంది. ఇలాంటి ఏడాదికి రూ.1 లక్ష రెంటు దాటే సందర్భంలో ట్యాక్స్ పేయర్లు తమ ఇంటి యజమాని పాన్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. వారు తమ ఐటీఆర్‌లో రెంటల్ ఇన్‌కమ్ వెల్లడించాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 3. తప్పుడు క్లెయిమ్ చేస్తే భారీ పెనాల్టీకొన్నిసార్లు తప్పుడు హెచ్ఆర్ఏ క్లెయిమ్స్ చేస్తుంటారు. ఇలాంటి వాటికి సెక్షన్ 270ఏ (Section 270A) వర్తిస్తుంది. ఇలా తప్పుడు క్లెయిమ్స్ చేసినట్లు గుర్తిస్తే పన్ను బకాయిలపై 50 శాతం నుంచి 200 శాతం వరకు పెనాల్టీ కట్టాల్సి రావచ్చు. ఇంటి యజమానికి రికార్డులతో క్రాస్ చెక్ చేస్తారు. 4. ఫ్యామిలీలకు గుడ్‌న్యూస్పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్సులను ఒక్కో చిన్నారికి నెలకు రూ. 100 నుంచి రూ. 3000లకు పెంచారు. హాస్టల్ అలవెన్సులు నెలకు రూ. 300 నుంచి రూ. 9000లకు పెంచారు. ఈ విషయంలో ఉద్యోగులకు ఇది శుభవార్త. పెద్ద మొత్తంలో అలవెన్సులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఉద్యోగి ఈ కొత్త హెచ్ఆర్ఏ రూల్స్ తెలుసుకుని, సరైన అవగాహనతో ఐటీ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది.