Iran War: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదు.. ఇదంతా ట్రంప్ కుట్ర.. ఇరాన్ కౌంటర్

Wait 5 sec.

పశ్చిమాసియాలో చేసిన ప్రకటనపై టెహ్రాన్ స్పందించింది. తమ దాడులకు ట్రంప్ భయపడ్డారని, అమెరికా, ఇజ్రాయెల్‌లు చిత్తుగా ఓడిపోయాయని ఇరాన్ ఎద్దేవా చేసింది. అయితే, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. సమయం చూసి మళ్లీ తమపై దాడులు చేసేందుకే ట్రంప్ ప్లాన్ చేశారని, ఆయన నమ్మబోమని ఇస్లామిక్ రిపబ్లిక్ తేల్చిచెప్పింది. చర్చల విషయంలో ఎవరూ మధ్యవర్తిత్వం వహించడం లేదని, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది ఇదంతా డొనాల్డ్ ట్రంప్ కుట్రని ఆరోపించింది.‘‘ట్రంప్ ప్రకటన ఆయన మునుపటి బెదిరింపుల నుంచి వెనక్కితగ్గడమే అయినా.. ఇస్లామిక్ రిపబ్లిక్ గతంలో ప్రకటించిన వైఖరికి కట్టుబడి ఉంది. ఇరాన్‌పై దాడి చేస్తున్న దురాక్రమణదారులకు ఆ జల మార్గం మూసివేసే ఉంటుంది’’ అని ఇరాన్ మీడియా తెలిపింది.ఇరాన్ పార్లమెంటు జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ మాట్లాడుతూ.. ‘‘మా పోరాటం కొనసాగుతోంది. సైతానుకు ఇది మరో ఓటమి. ట్రంప్, అమెరికా మరోసారి విఫలమయ్యాయి’’ అని పేర్కొన్నారు.తమతో యుద్ధంపై మరోసారి ట్రంప్ వెనక్కి తగ్గారని ఎగతాళి చేసింది. తమ నుంచి వచ్చిన గట్టి హెచ్చరిక కారణంగా ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకునే ప్లాన్ నుంచి అమెరికా అధ్యక్షుడు వెనకడుగు వేశారని అఫ్గన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రకటించడం గమనార్హం.యుద్ధంపై తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టిన ట్రంప్.. ఐదు రోజుల పాటు ఇరాన్‌పై దాడులు నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. పశ్చిమాసియాలో శాంతికి తాను కృషి చేస్తానని, గత రెండు రోజులుగా ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ చర్చలు మరో వారం కొనసాగుతాయని వివరించారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరగుతున్నాయన్న ట్రంప్.. ఇరాన్ ఇంధన మౌలిక సౌకర్యాలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేయవద్దని సైన్యాన్ని ఆదేశించినట్టు చెప్పారు.అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. యుద్ధం తాత్కాలికంగా ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటన చేసిన కాసేపటికే.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులు చేసింది. టెహ్రాన్‌పై బాంబులతో విరుచుకుపడింది. దీంతో యుద్ధం విరమణ కేవలం అమెరికాకే పరిమితమనే సంకేతాలు ఇజ్రాయెల్ పంపినట్టయ్యింది.