రాష్ట్ర ప్రభుత్వం అర్థ గణాంకశాఖలో ఉద్యోగ వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పాతకాలం నుంచి కొనసాగుతున్న కొన్ని కేడర్లను పూర్తిగా రద్దు చేసి, సృష్టించింది. ప్రణాళికశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. వివిధ విభాగాల్లోని 38 పోస్టులను రద్దు చేసి.. వాటి స్థానంలో 166 కొత్త నియామకాలకి ఆమోదం తెలిపింది. కొత్తగా మంజూరైన వాటిలో 46 గణాంక అధికారులు, 64 ఉపగణాంక అధికారులు, 12 ఉప సంచాలకులు, 12 సహాయ సంచాలకులు, 5 పర్యవేక్షకులు, 23 జూనియర్ అసిస్టెంట్లు, 4 సీనియర్ అసిస్టెంట్లు ఉన్నాయి. ఇక రద్దయిన వాటిలో 8 సహాయ గణాంక అధికారులు, 15 టైపిస్టులు, 8 స్టెనోగ్రాఫర్లు, 7 డ్రైవర్లు ఉన్నారు. పాత కేడర్ల రద్దుతోపాటు కొత్తగా సృష్టించిన పోస్టులు ఈ శాఖ పనితీరును ఆధునీకరించే దిశగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ శాఖలో మొత్తం 277 పోస్టులు ఉండగా.. తాజా మార్పులతో ఆ సంఖ్య 405కి పెరిగింది. అంటే పాత కేడర్లను తగ్గించి, ఆధునిక విధానాలకు సరిపోయే నూతన ఉద్యోగాల ద్వారా విభాగ పనితీరును బలోపేతం చేశారు. ఉద్యోగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టైపిస్టులు, డ్రైవర్లు వంటి పాత కేడర్లు డిజిటలైజేషన్ నేపథ్యంలో అవసరం తగ్గిపోవడంతో రద్దు చేయడం సహజమని చెబుతున్నారు. మరోవైపు గణాంక అధికారులు, ఉపగణాంక అధికారులు వంటి కొత్త పోస్టులు పెరగడం వలన డేటా సేకరణ, విశ్లేషణ, ప్రణాళికా రూపకల్పన మరింత సమర్థవంతంగా జరుగుతుందని భావిస్తున్నారు. ఈ మార్పులు భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు గణనీయమైన తోడ్పాటు అందిస్తాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో గ్రూప్‌–1 నియామకాలకు సంబంధించిన వివాదం మళ్లీ హైకోర్టు ముందు వచ్చింది. టీజీపీఎస్సీ విడుదల చేసిన జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌, మార్కుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఎంపికైన అభ్యర్థి ఒకరు అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సీజే ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఇదే అంశంపై వేసినట్లు న్యాయవాదులు తెలిపారు. రెండు పిటిషన్లను కలిసి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. మెయిన్స్‌ పత్రాల పునర్‌మూల్యాంకనం, లేదా సమయానికే ప్రక్రియ పూర్తి చేయలేకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని గతంలో జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు ఆదేశించిన విషయం తెలిసిందే.