ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉందో.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెస్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. దీంతో ఇరు దేశాల ఆటగాళ్లు యాషెస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఇలాంటి యాషెస్ త్వరలో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానుంది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మొత్తంగా 16 మందితో కూడిన జట్టును మంగళవారం కరారు చేసింది. గాయంతో బాధపడుతున్నప్పటికీ.. బెన్ స్టోక్స్‌ను ఇంగ్లాండ్ ఎంపిక చేసి సారథిగా ప్రకటించింది. హ్యారీ బ్రూక్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ఇక ఇటీవల ముగిసిన అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో సత్తాచాటిన పలువురు ఆటగాళ్లకు సైతం యాషెస్ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కింది. అయితే భారత్‌తో జరిగిన ఓవల్ టెస్టులో గాయపడిన స్టార్ పేసర్ 36 ఏళ్ల క్రిస్ వోక్స్ మాత్రం ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. చాలా రోజుల తర్వాత విల్ జాక్స్.. టెస్ట్ జట్టులోకి వచ్చాడు. నవంబర్ 21న ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా గడ్డపై విజేతగా నిలవని ఇంగ్లాండ్ ఈసారి రికార్డు తిరగరాయాలని పట్టుదలతో ఉంది. యాషెస్ సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు:జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్‌, విల్ జాక్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, మార్క్ వుడ్. యాషెస్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..తొలి టస్టు: నవంబర్ 21 - 25 (పెర్త్‌ క్రికెట్ స్టేడియం)రెండో టెస్టు: డిసెంబర్ 4 - 8 (గబ్బా క్రికెట్ స్టేడియం)మూడో టెస్టు: డిసెంబర్ 17 - 21 (ఆడిలైడ్ ఓవల్‌ స్టేడియం)నాలుగో టెస్టు: డిసెంబర్ 26 - 30 (మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌)ఐదో టెస్టు: జనవరి 4 - 8 (సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌)