ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో మంత్రి సొంతిల్లు నిర్మించుకోనున్నారు. ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇల్లు నిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ మున్సిపల్ శాఖ కూడా అమరావతిలో ఇంటి నిర్మాణానికి సన్నాహాలు మొదలుపెట్టారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో నారాయణ ఇంటి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ 6 రోడ్డు పక్కన.. చంద్రబాబు ఇంటికి అత్యంత సమీపంలోనే నారాయణ స్థలం కూడా కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇంటి నిర్మాణం కోసం 4500 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశారు మంత్రి నారాయణ. నారాయణ కొనుగోలు చేసిన స్థలం.. నిర్మాణ దశలో ఉన్న చంద్రబాబు ఇంటికి రెండు ప్లాట్ల దూరంలో ఉంది. వెలగపూడికి చెందిన ఓ రైతు వద్ద నుంచి మంత్రి నారాయణ దీనిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ ప్లాట్‌లో ఇటీవలే జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా పూర్తి చేశారు. మట్టిని తోలారు. దసరా రోజున ఇంటి నిర్మాణానికి మంత్రి నారాయణ భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు అమరావతిలో జరిగింది. చంద్రబాబు కుటుంబం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది. వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఉన్న ఓ రైతు వద్ద నుంచి కొనుగోలు చేసింది. అక్కడే ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. అమరావతిలో చంద్రబాబు ఇంటిని1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జి ప్లస్‌ 1 తరహాలో నిర్మించనున్నారు. ఇంటి ఆవరణలో ఎక్కువ భాగం పచ్చదనం, మొక్కలు పెంచాలని నిర్ణయించారు.చూస్తోంది. ఏడాదిలోపు ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసి కొత్తింట్లోకి అడుగుపెట్టాలని చంద్రబాబు కుటుంబం భావిస్తోంది. మరోవైపు రాష్ట్ర విభజన అనంతరం నుంచి చంద్రబాబు ఉండవల్లి కరకట్ట మార్గంలో ఉన్న లింగమనేని అతిథిగృహంలో ఉంటున్నారు. ఇటీవలే ఓ రైతు కుటుంబం నుంచి ఈ ప్లాట్ కొనుగోలు చేశారు. 25 వేల చదరపు గజాలు ఉండే ఈ ప్లాట్‌.. ఈ-6 రోడ్డుకు ఆనుకొని ఉంది. అలాగే ఈ ప్లాట్‌కు ఆనుకుని నాలుగు వైపులా రోడ్డు ఉంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు కూడా దీని పక్కనుంచే వెళ్తుంది. అలాగే ఎన్జీవోల నివాస సముదాయాలు, గెజిటెడ్‌ అధికారుల నివాస సముదాయాలు, జడ్జి బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ వంటి కీలక నిర్ణాణాలు ఈ ప్లాట్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇదే సరైన ప్రాంతామని భావించిన చంద్రబాబు.. రైతుల వద్ద నుంచి భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. తాజాగా నారాయణ కూడా చంద్రబాబు బాటలోనే ఆ ప్రాంతంలోనే ఇంటి నిర్మాణానికి సన్నాహాలు చేస్తూ ఉండటం విశేషం.