: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కొత్త వేతన సంఘం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే.. వారి జీతాలు, ఇతర అలవెన్సులు సహా డీఏ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లను నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఈ వేతన సంఘం సిఫార్సులను బట్టే.. జీతాలు, పెన్షన్లు ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. ప్రతి పదేళ్లకు వేతన సంఘం గడువు తీరుతుంది. ఇప్పుడు.. ఏడో వేతన సంఘం ఈ ఏడాదితో ముగియబోతోంది. దీంతో.. కొత్త వేతన సంఘం కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. >> ఈ సంవత్సరం లభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ కమిషన్ ద్వారా సుమారు 50 లక్షల మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సహా 65 లక్షల మంది వరకు పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. వాస్తవానికి.. ఈ ఏడాది 7వ వేతన సంఘం గడువు తీరితే కొత్త ఏడాదిలోనే ప్రారంభమవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరిగే పరిస్థితులు కనిపించట్లేదని తెలుస్తోంది. గతంలో నియమించిన వేతన సంఘాల చరిత్రను పరిశీలిస్తే.. ఇది అర్థమవుతుంది. ఒక కమిషన్ నియామకం జరిగినప్పటి నుంచి అది పూర్తిగా అమలయ్యేందుకు 2 నుంచి 3 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. అయితే.. ఇప్పుడు ఈ ఏడాది ముగిసేందుకు మరో 3 నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున.. ఇప్పుడు ఈ 8వ వేతన సంఘం నియామకం, రిపోర్ట్ సబ్మిషన్, ప్రభుత్వ ఆమోదం ఇలాంటి ప్రక్రియల్ని దృష్టిలో పెట్టుకుంటే.. దీని అమలు 2028 నాటికి జరిగే అవకాశం ఉందని పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.>> ఇక్కడ మనం అంతకుముందు వేతన సంఘాల నియామకం, నివేదిక సమర్పణ, అమల్లోకి వచ్చిన సంవత్సరం, కీలక మార్పులు వంటి వాటి గురించి తెలుసుకుందాం. నియమించగా.. 2015 నవంబర్ నెలలో నివేదిక సమర్పించారు. 2016, జనవరి 1 న ఇది అమల్లోకి వచ్చింది. ఇక్కడ రిపోర్ట్ ఆమోదించి అమలు చేసేందుకు ప్రభుత్వానికి 7 నెలల వరకు సమయం పట్టింది. 6వ వేతన సంఘం విషయానికి వస్తే ఇది 2006 అక్టోబర్ నెలలో నియమించగా.. 2008 మార్చిలో రిపోర్ట్ సమర్పించారు. ఇక 2006, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. 5వ వేతన సంఘం ఏర్పాటు 1994 ఏప్రిల్‌లో జరగ్గా.. ఇది 1996, జనవరి 1న అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే 8వ వేతన సంఘం.. 2028లోనే అమల్లోకి వస్తుందని అంతా భావిస్తున్నారు.