కీలక నిర్ణయం తీసుకున్న టీజీఎస్ఆర్టీసీ.. కొత్తగా సరికొత్తగా బస్ డిపోలు, బస్ స్టేషన్లు..

Wait 5 sec.

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధునీకరిస్తున్న స్ఫూర్తితో.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఆధ్వర్యంలో రూపురేఖలను మార్చేందుకు చారిత్రక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాల స్థాయిలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించే దిశగా ఆర్టీసీ కీలక అడుగులు వేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సురక్షితమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో... బస్ డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ, ఆధునీకరణ కోసం తెలంగాణ ఆర్టీసీ ఏకంగా రూ. 108.02 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బస్ స్టేషన్‌ను ప్రయాణానికి ఆహ్లాదకరమైన కేంద్రంగా మార్చనున్నారు. ప్రతీ బస్ స్టేషన్, బస్ డిపోలు కొత్తగా కనపడనున్నాయి.ఆధునీకరణ ప్రణాళికలో ఏమున్నాయి..?తెలంగాణ ఆర్టీసీ చేపట్టిన ఈ భారీ ఆధునీకరణ ప్రాజెక్టులో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. బస్ స్టేషన్లలో శుభ్రమైన, ఆధునికమైన మరుగుదొడ్లు (Restrooms) ఏర్పాటు చేయడం.. డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, మెరుగైన ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లు (PIS) ఏర్పాటు చేయడం... రైల్వే స్టేషన్లలో మాదిరిగా, ప్రయాణికులు సౌకర్యవంతంగా వేచి ఉండేందుకు మెరుగైన వెయిటింగ్ లాంజ్‌లు, సీటింగ్‌ను ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు.. ఆర్టీసీకి అదనపు ఆదాయం వచ్చేలా.. బస్ స్టేషన్లలో చిన్నపాటి వాణిజ్య దుకాణాలు (Commercial Outlets), ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా పెంచడం వంటివి ఇందులో ఉంటాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే, ఆర్టీసీ స్టేషన్లు ఇకపై రద్దీగా ఉండే ప్రాంతాలుగా కాకుండా.. ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ట్రావెల్ హబ్‌లుగా మారనున్నాయి. ఆధునీకరణతో పాటు, తెలంగాణ ఆర్టీసీ తన కార్యకలాపాలను విస్తరించడంపై కూడా దృష్టి పెట్టింది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఆర్టీసీ తన బస్సుల సంఖ్యను పెంచుతోంది. ఇందులో భాగంగా పాత బస్సుల స్థానంలో అనేక కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఎయిర్ కండిషన్డ్, ఎలక్ట్రిక్ బస్సుల (Electric Buses) సంఖ్యను పెంచడంపై దృష్టి సారించింది. ఇప్పటికే చాలా వరకు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.