: దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులం ఏకంగా రూ. 1.16 లక్షలు దాటింది. 22 క్యారెట్ల పసిడి ధర కూడా 10 గ్రాములు రూ. 1.06 లక్షలు దాటింది. ఈ ధరలు మధ్యతరగతికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. అందుకే ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు. 'బంగారం కొనలేకపోతున్నాం.. కనీసం ఉన్న పాత బంగారాన్ని అయినా తాకట్టు పెడదాం' అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు బంగారం అధిక విలువ కారణంగా.. ఆర్థిక అవసరాలు ఉన్న వారు మాత్రమే కాదు.. ఇతర వ్యాపారాల కోసం, పెట్టుబడుల కోసం కూడా ఇంట్లోని బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టే వారి సంఖ్య ఎక్కువైంది. >> మరోవైపు కొత్త ఆభరణాల్ని కొనుగోలు చేయలేని వారు.. పాత నగల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. పాత ఆభరణాలకు కొంత నగదు జత చేసి.. కొత్తవి తీసుకునేందుకు చూస్తున్నారు. దీనికి ఇటీవల డిమాండ్ భారీగా పెరుగుతోందని చెప్పొచ్చు. దీంతో పండగ సమయంలోనూ ఆభరణాల కొనుగోళ్లు పడిపోతున్నాయని వర్తకులు వాపోతున్నారు. ధర భారీగా పెరుగుతున్న క్రమంలో.. బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) గోల్డ్ లోన్లను భారీగా పెంచేశాయి. ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి.ఈజీగా లోన్: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న వేళ.. ఆర్బీఐ హెచ్చరికలతో బ్యాంకులు ఇప్పటికే పర్సనల్ లోన్ల జారీని తగ్గించేశాయి. ఇవి అన్ సెక్యుర్డ్ లోన్లు కాబట్టి పరిమిత సంఖ్యలోనే జారీ చేస్తున్నాయి. దీంతో హామీ ఉండే.. బంగారం తనఖా రుణాలు ఈజీగా లభిస్తున్నాయి.ఎక్కువ లోన్: 10 గ్రాముల బంగారం ధర తులం రూ. 1 లక్ష మార్కు దాటడంతో.. ఇప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. గ్రాము గోల్డ్‌పై ఇచ్చే రుణ మొత్తాన్ని పెంచేశాయి. బంగారం విలువలో దాదాపు 80 శాతం వరకు లోన్ అందిస్తున్నాయి. దీంతో తులంపై రూ. 80 వేల వరకు కూడా వస్తుందని చెప్పొచ్చు. పండగ సీజన్లో చిన్న చిన్న వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు.. ఇంకా రైతులు, గృహస్థులు ఎక్కువగా ఈ లోన్లు తీసుకుంటున్నారు. అయితే ఈజీగానే అనిపిస్తున్నా.. ఇక్కడ రిస్క్ గురించి ఆలోచించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బంగారం ధర తగ్గితే.. అప్పుడు ఆర్థిక సంస్థలు అదనపు మార్జిన్ కోసం మరింత బంగారం తాకట్టు పెట్టమని ఒత్తిడి చేయడం లేదా కొంత అప్పయినా తీర్చాలని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పటికప్పుడు మీరు అప్పు తీర్చే పరిస్థితి లేకపోతే .. ఆర్థిక సంస్థలు నిర్దేశిత కాలం, నిబంధనల ప్రకారం.. బంగారం వేలం వేసే అవకాశం ఉంటుంది. బంగారంతో పాటుగా వెండి కూడా ఇటీవల భారీగా దూసుకెళ్తోంది. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ నేపథ్యంలో.. ధర ఇటీవల కేజీకి హైదరాబాద్ నగరంలో రూ. 1.60 లక్షలకు చేరింది.