బంగారం ధరల్లో ఊహించని మార్పు.. రాత్రికి రాత్రే ఇలా జరిగిందేంటి?

Wait 5 sec.

: అంతర్జాతీయంగా రాజకీయ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు సహా మరికొన్ని ఇతర కారణాలతో బంగారం ధర మళ్లీ భారీగా పెరిగింది. రాత్రికి రాత్రే అంతా తలకిందులైంది. ఇప్పటికే గోల్డ్ రేటు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్లో ఉండగా.. ఇప్పుడు అంతకుమించి రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తాజాగా మరోసారి భారత్ సహా అంతర్జాతీయంగా ధరలు ఎగబాకాయి. ఈ 2025 ఏడాదిలోనే ఏకంగా గోల్డ్ రేటు 45 శాతానికి మించి పెరిగింది. దీంతో.. ప్రపంచ నలుమూలలా ఉన్నటుంటి.. ఇన్వెస్టర్లు, మార్కెట్ వాచర్స్ కూడా దీనిపై ఓ కన్నేశారు. సాధారణంగానే.. బంగారం అనేది సేఫ్ హ్యావెన్ అసెట్. దీంతో.. ఇటువైపు పెట్టుబడులు పెట్టేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఊహించని రీతిలో అంతకుమించి ధర ఎగబాకింది. >> అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే బంగారం ధర భారీగా పెరిగింది. కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3780 డాలర్ల వద్ద ఉండగా.. ఇప్పుడు అది 50 డాలర్లకుపైగా ఒక్కరోజులోనే పెరగడంతో ప్రస్తుతం 3,830 డాలర్ల మార్కుకు చేరింది. సిల్వర్ ధర చూస్తే 46.80 డాలర్ల వద్ద ఉంది. ఇది కూడా కిందటి రోజుకు మించి పెరిగింది. ఇక రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. డాలరుతో పోలిస్తే మారకం విలువ రూ. 88.73 వద్ద ట్రేడవుతోంది.దేశీయంగా చూస్తే.. తాజాగా హైదరాబాద్ నగరంలో ఒక్కరోజులో రూ. 850 పెరగ్గా తులం రూ. 1,06,700 వద్ద ఉంది. కిందటి రోజు రూ. 550 పెరగ్గా.. దానికి ముందు రూ. 400 పెరిగింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములపై రూ. 920 పెరిగి ప్రస్తుతం రూ. 1,16,400 వద్ద ఉంది. గోల్డ్ రేట్ల బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. ఒక్కరోజే ఇది రూ. 1000 పెరగడంతో ప్రస్తుతం కేజీకి హైదరాబాద్ మార్కెట్లో రూ. 1.60 లక్షలు పలుకుతోంది. ఇది కూడా ఆల్ టైమ్ గరిష్ట స్థాయి కావడం గమనార్హం. గోల్డ్, సిల్వర్ రేట్ల పెరుగుదలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఇటీవలి సమీక్షలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించగా.. భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉండనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. అంటే ఇక్కడ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. అప్పుడు బంగారం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నారు. డాలర్ పడిపోతుండటం వల్ల ఇతర కరెన్సీలతో బంగారం కొనుగోలు చేసే వారికి.. తక్కువకే లభిస్తుంది కాబట్టి డిమాండ్ పెరుగుతోంది.ర కేంద్ర బ్యాంకులు ఇప్పటికీ విపరీతంగా బంగారం కొనుగోళ్లు జరుపుతున్నాయి. ఇక్కడ చైనా, రష్యా వంటివి ఇందులో ముందున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో కూడా ఇన్వెస్టర్లు.. సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారంవైపు మొగ్గుచూపుతున్నారు.