Maruti Suzuki: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కొత్త రేట్ల అమలు దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం ఒకేసారి జరిగింది. దేవీ నవరాత్రి ఉత్సవాలు, కొత్త రేట్లు అమలులోకి వచ్చిన సెప్టెంబర్ 22వ తేదీ నుంచి చూసుకుంటే కొత్త కార్ల విక్రయాలు దూసుకెళ్తున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి మూడు రోజుల్లోనే రిటైల్‌గా 75,000 కార్లు విక్రయించామని మారుతీ సుజుకీ ప్రకటించింది. ఇంకా చిన్న కార్లకు సంబంధించి కొన్ని వేరియంట్లను డెలివరీ చేయాల్సి ఉన్నట్లు తెలిపింది. జీఎస్టీ కొత్త రేట్లతో ధరలు తగ్గింపు సహా పండగ గిరాకీ కార్ల విక్రయాలను జీఎస్టీ తగ్గింపునకు ముందు సాధారణంగా రోజు 40-45 వేల వరకు కార్ల గురించిన విచారణలు వచ్చేవని బెనర్జీ తెలిపారు. అయితే, అది ఇప్పుడు రెట్టింపు అయిందన్నారు. రోజుకు దాదాపు 80 వేల మంది వరకు కార్ల గురించి విచారిస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 22 తర్వాత రోజుకు సగటున 18000 బుకింగ్స్ నమోదు అవుతున్నట్లు వివరించారు. కొన్ని వేరియంట్ కార్లకు అధిక గిరాకీ ఉండడం వల్ల డెలివరీలో జాప్యం ఏర్పడుతోందని తెలిపారు. అయినప్పటికీ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు.. పండగ సీజన్ గిరాకీ అందిపుచ్చుకునేందుకు జీఎస్టీ రేట్ల కోతతో పాటు కొన్ని మోడళ్ల కార్లపై అదనంగా ధరలు తగ్గించి అదిరే శుభవార్త చెప్పింది. ఆల్టో కే10, డిజైర్, స్విఫ్ట్, బ్రెజా, ఎస్- ప్రెస్సో వంటి మోడళ్లు ధరలు భారీగా తగ్గిన కార్ల జాబితాలో ఉన్నాయి. రూ. 46,400 నుంచి గరిష్ఠంగా రూ. 1,29,600 వరకు కార్ల ధరలు తగ్గించినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. మారుతీ సుజుకీ ధరల తగ్గింపు ఇలా..ఎస్ ప్రెస్సో కారుపై రూ. 1,29,600 తగ్గించిందిఆల్టో కే10 కారుపై రూ. 1,07,600 మేర తగ్గించింది.స్విఫ్ట్ కారుపై రూ. 84,600డిజైర్ కారుపై రూ. 87,700బ్రెజా కారుపై రూ. 1,12,700ఫ్రాంక్స్ కారుపై రూ. 1,12,600గ్రాండ్ విటారా కారుపై రూ. 1,07000ఎర్టిగా కారుపై రూ. 46,400వస్తు సేవల పన్నులో 12,28 శాతం శ్లాబులను తొలగించి 5, 18 శాతం శ్లాబులను కొనసాగిస్తున్నారు. 1500 సీసీ ఇంజిన్ సామర్థ్యం లోపు కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీంతో కార్ల ధరలు భారీగా తగ్గాయి. ఆపై కంపెనీలు పండగ డిస్కౌంట్లు ఇవ్వడంతో కొనుగోలుదారులకు భారీగా ఆదా అవుతుందని చెప్పవచ్చు.