పాక్ ఆటగాళ్ల తీరుపై కోచ్ సీరియస్.. ముందు ఆటపై దృష్టి పెట్టండంటూ హెచ్చరిక!

Wait 5 sec.

ఈ క్రమంలోనే ఇరు జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. దాంతో ఈ ఉత్కంఠ సమరానికి ముందు పాక్ క్రికెటర్లకు కోచ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ టోర్నీలో భారత్‌పై పాకిస్తాన్ రెండుసార్లు ఓడిపోవడంతో.. కోచ్ కూడా తమ ఆటగాళ్లను కంట్రోల్‌లో ఉంచుకునేలా చూస్తున్నాడు. భారత్ చేతిలో రెండుసార్లు చిత్తయిన పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌పై జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో విజయంతో ఫైనల్‌లో అడుగుపెట్టింది. సెప్టెంబర్ 28న జరిగే భారత్ - పాకిస్తాన్ ఫైనల్ పోరుకు ముందు పాకిస్థాన్ ఆటగాళ్ల హావభావాలపై వచ్చిన విమర్శలకు జట్టు కోచ్ మైక్ హేసన్ స్పందించాడు.భారత్‌పై సూపర్ 4 మ్యాచ్‌లో హారిస్ రవుఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్ ప్రవర్తనపై బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, తన ఆటగాళ్లు క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని కఠిన హెచ్చరిక జారీ చేసినట్లు హేసన్ వెల్లడించాడు. "నా సందేశం ఒక్కటే.. ఆటపై మాత్రమే ఫోకస్ చేయాలి. హై ప్రెజర్ మ్యాచ్‌ల్లో భావోద్వేగాలు సహజమే కానీ, ఇప్పుడు ఫైనల్ ముందు మేము పూర్తిగా క్రికెట్‌పైనే కేంద్రీకరించాలి" అని న్యూజిలాండర్ మైక్ హేసన్ స్పష్టం చేశాడు. గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలవగా, సూపర్ - 4 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో మరోసారి పైచేయి సాధించింది. దీంతో 2022 నుంచి ఇప్పటివరకు రెండు జట్ల మధ్య జరిగిన ఏడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్ అపజయం చూడలేదు. మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లలోనూ టీమిండియానే విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో కేవలం 127/9 చేసిన పాకిస్థాన్, రెండో మ్యాచ్‌లో కొంత మెరుగైన ప్రదర్శన చేసినా.. అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ గేమ్‌ను తనవైపు తిప్పుకుందన్నాడు హేసన్. “భారత్ ఎందుకు నంబర్ వన్ జట్టు అనేది అందరికీ తెలుసు. వారిని ఎక్కువసేపు ఒత్తిడిలో ఉంచగలిగితేనే గెలిచే అవకాశం ఉంటుంది. గత మ్యాచ్‌లో మేము ఆ దిశగా మెరుగైన ప్రదర్శన చేశాం. ఇప్పుడు టైటిల్ మ్యాచ్‌లో అదే స్థాయి క్రమశిక్షణ చూపాలి” అని ఆయన చెప్పాడు. భారత్‌ను ఎదుర్కొనే ఫైనల్ అవకాశాన్ని జట్టు సంపాదించిందని, ఇప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడమే తమ లక్ష్యమని హేసన్ స్పష్టం చేశాడు. “మేము ఈ పొజిషన్‌కి అర్హులమని నిరూపించుకున్నాం. ఇప్పుడు ట్రోఫీని గెలిచే దిశగా శ్రమించాలి” అని ఆయన అన్నాడు.