Stock Split: స్మాల్ క్యాప్ కేటగిరి, ఐటీ సెక్టార్ కంపెనీ అయిన () బోర్డు డైరెక్టర్స్ కొద్ది రోజుల క్రితం సమావేశమై ఆమోదం తెలుపారు. ఈ స్ప్లిట్ రికార్డు డేట్ సైతం కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. ఇక స్టాక్ స్ప్లిట్ తర్వాత రూ. 482 వద్ద ఉన్న షేరు ధర రూ. 48.2 స్థాయికి దిగివస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉండేలా చేసేందుకు ఈ స్టాక్ స్ప్లిట్ చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది. లక్ష రూపాయలు పెట్టి ఉంటే ఆరు నెలల్లోనే దాదాపు డబుల్ అయింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం ఇటీవల జరిగిన కంపెనీ డైరెక్టర్స్ భేటీలో 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయడానికి ఆమోదం లభించింది. దీని అర్థం ప్రస్తుతం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక ఈక్విటీ షేరును రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 10 ఈక్విటీ షేర్లుగా విభజిస్తారు. ఈ స్టాక్ స్ప్లిట్‌కి అర్హులైన వాటాదారులను నిర్ణయించేందుకు రికార్డు డేట్ అక్టోబర్ 6, 2025గా కంపెనీ బోర్డు డైరెక్టర్స్ నిర్ణయించారు.ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 508.80, కనిష్ఠ ధర రూ. 210.10 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ షేరు 3 శాతం లాభాన్ని అందించింది. గత నెల రోజుల్లో 17 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఆరు నెలల్లో 90 శాతం మేర పెరిగింది. లక్ష రూపాయల పెట్టుబడిని ఆరు నెలల్లోనే రూ. 1.90 లక్షలుచేసింది. గత ఏడాది కాలంలో 26 శాతం పెరిగింది. గత ఐదేళ్లలో 2578 శాతం లాభాన్ని అందించింది. అంటే లక్ష రూపాయలను ఏకంగా రూ. 27 లక్షల వరకు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 491 కోట్ల వద్ద ఉంది. గమనిక: ఈ కథనం సమాచారం అందించేందుకే. ఎలాంటి పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించడం లేదు. స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అవగాహన లేకుండా డబ్బులు పెడితే మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంటుంది.