ఏపీని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. 'ఉత్తర, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ వాయువ్య, పశ్చిమ మధ్య ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. ఇవాళ రాత్రికి ఉత్తర, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఇవాళ బలపడే అవకాశం ఉంది, శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు' అని హెచ్చరించారు.'పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తృతంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అనేకచోట్ల గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. గురువారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతోతో గోదావరి నదిలో నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 36.30 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న అదనపు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల నీటిమట్టం పెరుగుతోంది. ఉప నదులు కూడా గోదావరిలో కలుస్తుండటంతో వరద ఉధృతి ఎక్కువవుతోంది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. అదనంగా వస్తున్న 6,09,380 క్యూసెక్కుల నీటిని 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం స్పిల్‌వే పైభాగంలో నీటిమట్టం 30.740 మీటర్లుగా ఉంది. కింది భాగంలో 21.600 మీటర్లుగా నమోదైంది.