: భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మహిళలు ఆభరణాలుగా ధరిస్తారు. ఇక పండగల సమయంలో బంగారం కొంటే మంచిదని భావిస్తారు. అందులోనూ దసరా, దీపావళికి బంగారం ఎక్కువగా కొంటుంటారు. ఇప్పుడు దసరా ఉత్సవాలు నడుస్తున్నాయి. దీంతో బంగారానికి గిరాకీ పెరిగింది. ఈ సమయంలో దేశీయ మార్కెట్లో లు వరుసగా రెండో రోజూ తగ్గాయి. కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. రెండు రోజుల క్రితం పసిడి ధర ఆల్ టైమ్ హై స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. అయితే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలను తోసిపుచ్చిన క్రమంలో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 26వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఎంతకు దిగివచ్చిందో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైమ్ హై స్థాయి నుంచి కాస్త వెనక్కి తగ్గాయి. అయితే, ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3744 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.32 శాతం పెరుగుదలతో 44.96 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. ఈరోజు భారత కరెన్సీ రూపాయి మారకం విలువ రూ. 88.767 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరహైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై క్రితం రోజూ రూ.320 తగ్గగా ఈరోజు మరో రూ.930 మేర పడిపోయింది. దీంతో మొత్తంగా రూ.1250 మేర తగ్గింది. ఇప్పుడు తులం బంగారం రేటు రూ.1,14,440 వద్దకు దిగివచ్చింది. స్థిరంగానే వెండిబంగారం ధర రెండు రోజులుగా తగ్గి ఊరట కల్పించినా వెండి ధర మాత్రం గరిష్ఠ స్థాయుల్లోనే కొనసాగుతోంది. రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.1,50,000 మార్క్ వద్దే ట్రేడవుతోంది. అయితే, ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు వంటి ఇతర నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,40,000 వద్ద కొనసాగుతోంది. ఈ కథనంలోని బంగారం, వెండి రేట్లు సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి ధరలు మారుతుంటాయి. ట్యాక్సులతో కలిపి లెక్కిస్తే ప్రాంతాల వారీగా ధరలు వేరు వేరుగా ఉంటాయి.