తమిళనాడులోని పవర్‌ ప్లాంట్‌తో ఘోర ప్రమాదం సంభవించింది. చెన్నై సమీపంలోని ఎన్నూర్ థర్మల్ పవర్‌ప్లాంట్‌లో మంగళవారం సాయంత్రం ఓ కట్టడం కూలిపోయింది. దీంతో దానిపై ఉన్న కార్మికులు కిందపడి గాయాలపాలయ్యారు. వీరిలో 9 మంది మృతి చెందగా... మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన రెస్క్యూ సిబ్బంది.. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.