60 ఏళ్లు దాటిన వారికి 'క్రెడిట్ కార్డు' ఇస్తారా? ఇస్తే ఎలా తీసుకోవాలి, రూల్స్ ఏంటి..

Wait 5 sec.

Credit Card: బ్యాంకులు అకౌంట్ ఉన్న వారికి డెబిట్ కార్డులు జారీ చేసినంత సులభంగా క్రెడిట్ కార్డులు ఇవ్వవు. క్రెడిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన నిర్వహణ, వయసు, ఆదాయం, ఉపాధి వంటి పలు విషయాలను పరిశీలిస్తాయి. అయితే, స్థిరమైన ఆదాయం ఉండి, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి సులభంగానే జారీ చేస్తాయి. అయితే, 60 ఏళ్ల వయసు దాటిన ఇచ్చేందుకు సంశయిస్తాయి. మంచి ఆదాయ వనరులు ఉన్న వారికే కార్డులు జారీ చేస్తుంటాయి. బకాయిలను సకాలంలో చెల్లిస్తారనే హామీ ఉన్నప్పుడే కార్డులు ఇస్తుంటాయి. కానీ, వృద్ధుల విషయంలో అధిక రిస్క్ ఉంటుంది. వారికి పని చేసే సామర్థ్యం చాలా తక్కువ. అందుకే పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం ఉండదు. సీనియర్ల వద్ద కార్డు బకాయులు వసూలు చేయడం పెద్ద పని. వయసు కారణంతో సీనియర్లపై ఆసక్తి చూపనప్పటికీ క్రెడిట్ కార్డు తీసుకునేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రైమరీ కార్డు పొందలేని సీనియర్ సిటిజన్లు యాడ్ ఆన్ కార్డులు తీసుకోవచ్చు. కొడుకు, కూతురు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు ఏదైనా బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు తీసుకుంటే వారి ప్రైమారీ కార్డు ద్వారా సీనియర్ సిటిజన్లు యాడ ఆన్ కార్డు పొందవచ్చు. యాడ్ ఆన్ కార్డులు ప్రైమరీ కార్డు మాదిరిగా ప్రయోజనాలు, ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటికి వార్షిక ఛార్జీలు సైతం ఉండవు. బకాయిల చెల్లింపు బాధ్యత సైతం ప్రైమరీ కార్డు ఉన్నవారిదే. యాడ్ ఆన్ కార్డు కోసం ఎలాంటి పత్రాలు చూపాల్సిన అవసరం లేదు. అలాగే క్రెడిట్ స్కోర్ ఉండాల్సిన అవసరం లేదు. సీనియర్లు కార్డు పరిమితికి సరిపడా తమ డిపాజిట్లను హామీగా ఉంచాల్సి ఉంటుంది. సీనియర్లు క్రెడిట్ కార్డును పొందేందుకు ఎక్కువగా ఉపయోగించే మార్గం సైతం ఇదే. ఇలాంటి కార్డులను సెక్యూర్డ్ కార్డ్స్ అని పిలుస్తారు. సీనియర్ సిటిజన్లు ఇలాంటి సురక్షితమైన క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకునేందుకు ఆదాయాలకు సంబంధించిన పత్రాలు, మెరుగైన క్రెడిట్ స్కోరు వంటివి చూపించాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీగా కార్డు పొందవచ్చు. చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారానే తీసుకుంటారు.