తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఉచితంగా కొత్త గదులు, ముందే బుక్ చేసుకోపోయినా పర్లేదు

Wait 5 sec.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి గదుల కష్టాలు తీరాయి. కొండపై కొత్త వసతి సముదాయం ప్రారంభమైంది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ఏపీ సీఎం చంద్రబాబు వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ5)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేశ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ పాల్గొన్నారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. కొత్త వసతి గృహంలో మొదటి బుకింగ్ టోకెన్‌ను భక్తులకు అందజేశారు.వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం రూ.102 కోట్లతో ఈ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ముందస్తు బుకింగ్ లేకున్నా, ఒకేసారి 4 వేల మందికి ఉచిత వసతి కల్పించనున్నారు. ఈ భవనంలో 16 డార్మిటరీలు ఉన్నాయి. వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయంలో భక్తుల సామాను భద్రపరచుకోవడానికి 2,400 లాకర్లు ఏర్పాటు చేశారు.. 24 గంటలూ వేడి నీటి సదుపాయం కూడా ఉంది. అంతేకాదు ఈ వేంకటాద్రి వసతి సముదాయం (పీఏసీ-5) ప్రాంగణంలో కొత్తగా కల్యాణకట్ట, భోజనశాల, వసతి గృహాలను ఏర్పాటు చేశారు. కల్యాణకట్టలో ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించవచ్చు. రెండు భోజనశాలల్లో 1400 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు. అంతకముందు ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద వేదపండితులు వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.. "ఇస్తికఫాల్" అంటూ వేద మంత్రాలతో ఆహ్వానించారు. దర్శనం తర్వాత, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్వామివారి ప్రసాదాలు అందజేశారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్ కూడా సీఎం వెంట ఉన్నారు.మరోవైపు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం చిన్నశేష వాహన సేవ జరిగింది. మలయప్పస్వామి ఐదు తలల శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గోవుల కాపరిగా, వేణుమాధవుడిగా శ్రీనివాసుడు భక్తులను ఆశీర్వదించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు ఇవాళ సాయంత్రం తిరుమల శ్రీవారికి హంసవాహన సేవ నిర్వహించనున్నారు. 'తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు' అని టీటీడీ తెలిపింది.