పాతూమ్ నిశాంక విధ్వంసం.. సెంచరీతో ఆసియా కప్‌లో నయా హిస్టరీ! ఏకంగా కోహ్లి సరసన..!!

Wait 5 sec.

గ్రూప్ మ్యాచ్‌లో అదరగొట్టిన శ్రీలంక.. సూపర్ - 4లో మాత్రం చతికిల పడింది. వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ బంగ్లా, పాక్‌పై ఓడిపోయి ఈ టోర్నీ నుంచే నిష్క్రమించింది. అయితే, లో మాత్రం.. తమ సత్తా ఏంటో చూయించింది. భారత్ 202 పరుగులు చేసినా.. ఛేజింగ్‌లో ఏ మాత్రం భయపడకుండా 202 పరుగులు చేసి మ్యాచ్‌ని సమం చేసింది. . ఈ మ్యాచ్‌లో లంక ఓపెనర్ నిశాంక బ్యాటింగ్‌కి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ - శ్రీలంక మ్యాచ్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తించింది. భారత్ ఇచ్చిన 203 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక జట్టుకు ఓపెనర్ ఊపిరి పోశాడు. టీమిండియా బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోశాడు. ఒకానొక దశలో నిశాంక రెండు ఓవర్ల ముందే మ్యాచ్‌ని ముగిస్తాడని అందరూ అనుకున్నారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 58 బంతులు ఆడిన నిశాంక 7 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 107 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో అవుటయ్యాడు. ఆసియా కప్ 2025లో తొలి సెంచరీ నమోదు చేసిన నిశాంక.. ఆసియా కప్ టీ20 హిస్టరీలో కూడా రికార్డు సృష్టించాడు. శ్రీలంక తరఫున తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా నిలవడమే కాకుండా.. ఓవరాల్‌గా మూడో బ్యాటర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఆసియా కప్ చరిత్రలో టీ20 మ్యాచ్‌లలో ఇద్దరంటే ఇద్దరే సెంచరీలు నమోదు చేశారు. తాజాగా ఆ జాబితాలో మూడో బ్యాటర్‌గా నిశాంక నిలిచాడు. అంతకు ముందు 2016లో హాంకాంగ్ బ్యాటర్ బాబర్ హయాత్ ఒమన్‌పై 122 పరుగులతో తొలి సెంచరీ నమోదు చేయగా.. టీమిండియా లెజెండ్రీ బ్యాటర్ విరాట్ కోహ్లి 2022లో అప్ఘనిస్తాన్‌పై 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పుడు భారత్‌పై నిశాంక 107 పరుగులతో మూడో శతకాన్ని నమోదు చేశాడు. శ్రీలంక టీ20 క్రికెట్ చరిత్రలో కూడా నిశాంక తన పేరు చిరస్థాయిగా నిలుపుకున్నాడు. శ్రీలంక జట్టు నుంచి మహేళ జయవర్దనే 2010లో జింబాబ్వేపై తొలిసారి సెంచరీ నమోదు చేయగా.. 2011లో ఆస్ట్రేలియాపై తిలకరత్నే దిల్షాన్ 104 పరుగులు చేశాడు. కుశాల్ పెరీరా 2025లో న్యూజిలాండ్‌పై 101 పరుగులతో శతకం బాదాడు. ఇప్పుడు నిశాంక భారత్‌పై 107 పరుగులతో టీ20 హిస్టరీలో తన పేరు నమోదు చేశాడు.