ఫైనల్‌లో భారత్ vs పాక్.. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో ఇదే తొలిసారి..!

Wait 5 sec.

41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో అరుదైన ఫీట్ ఆవిష్కృతం కాబోతోంది. టోర్నీ తొలి సీజన్ నుంచి భారత్, పాకిస్థాన్ ఇందులో భాగంగా ఉన్నాయి. అయితే చిరకాల ప్రత్యర్థులుగా పేరున్న భారత్, పాక్ ఒక్కసారి కూడా ఆసియాకప్ ఫైనల్‌లో తలపడలేదు. కానీ ఈసారి మాత్రం ఫైనల్‌లో ఈ రెండు జట్లూ తలపడనున్నాయి. అంతేకాకుండా టోర్నీ చరిత్రలో తొలిసారి ఈ రెండు జట్ల మధ్య ఒకే ఎడిషన్‌లో మూడు మ్యాచులు జరగనున్నాయి. 1984లో తొలిసారి ఆసియాకప్ టోర్నీ జరిగింది. తొలి ఎడిషన్‌లో కేవలం మూడు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 8కి చేరింది. 1984 నుంచి 2023 వరకు 16 ఎడిషన్లు జరిగాయి. అందులో భారత జట్టే ఆధిపత్యం ప్రదర్శించింది. ఏకంగా 8 సార్లు విజేతగా నిలిచింది. ఆ తర్వాత శ్రీలంక 6 సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ మూడు సార్లు ఫైనల్ చేరినా.. రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.1984 నుంచి ఏ జట్టు విజేతగా నిలిచిందంటే..భారత్ - 8 సార్లు (1984, 1988, 1990–91, 1995, 2010, 2016 2018, & 2023)శ్రీలంక - 2 సార్లు (1986, 1997, 2004, 2008, 2014, 2022)పాకిస్థాన్ - 2 సార్లు (2000 & 2012)భారత్ మొత్తంగా 10 సార్లు చేరింది. అందులో ఎక్కువ సార్లు శ్రీలంకతోనే ఫైనల్‌లో తలపడింది. కొన్నిసార్లు బంగ్లాదేశ్ తోనూ ఆడింది. కానీ పాక్‌తో మాత్రం ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండటం ఇదే తొలిసారి. పాకిస్థాన్ కూడా 2000, 2012లో టైటిల్ సాధించింది. కానీ అప్పుడు ఆ జట్టు ఇతర జట్లతోనే ఫైనల్ మ్యాచ్ ఆడింది. కానీ ఈసారి మాత్రం తొలిసారి ఆసియాకప్ ఫైనల్‌లో దాయాదుల పోరును చూడబోతున్నాం.ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, పాక్ రెండు సార్లు తలపడ్డాయి. గ్రూప్ స్టేజ్‌ మ్యాచుతో పాటు.. సూపర్-4లోనూ భారత జట్టు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. హ్యాట్రిక్ విజయం సాధించి.. తొమ్మిదోసారి ఆసియాకప్ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది.