దళపతి విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. చిన్నారులు సహా 20 మంది మృతి

Wait 5 sec.

(టీవీకే) పార్టీ అధినేత, నటుడు రాజకీయ ర్యాలీలో ఘోరం చోటు చేసుకుంది. విజయ్‌ను చూసేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానికులతో ర్యాలీలో కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 20 మంది మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నట్లు పేర్కొన్నారు. చాలా మందికి గాయాలు అయ్యాయని.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ ర్యాలీలో.. జనం మధ్యాహ్నం నుంచే బారులు తీరారు. చాలా మంది 6 గంటల ముందే ఆ ప్రాంతానికి చేరుకుని.. విజయ్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ రాక ఆలస్యం కావడంతో.. జనం తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలోనే జనం మధ్య తోపులాట జరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. భారీగా వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయలేక భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. ఒక్కసారిగా జనం ఎగబడటంతో తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. అయితే చిన్నారి కనిపించకపోవడంతో.. ఆమెను వెతికేందుకు జరిగిన ప్రయత్నంలోనే ఈ తొక్కిసలాట జరిగినట్లు కొందరు చెబుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటించిన దళపతి విజయ్.. గత కొన్ని రోజులుగా వరుసగా సమావేశాలు, బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఇక ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. 10 వేల మందితో ర్యాలీ చేసేందుకు విజయ్ అనుమతి తీసుకున్నారు. అయితే దళపతి విజయ్ సభలో తొక్కిసలాట జరగడం ఇదేం తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం.. మధురైలో నిర్వహించిన తొలి సభలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ ఘటనలో మొత్తం ఆరుగురు చనిపోయారు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రమాదమే జరగ్గా.. ఇందులో భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి.