మళ్లీ ఫెయిలైన సూరీడు.. అయినా భారీ స్కోరు చేసిన భారత్‌..!

Wait 5 sec.

టీమిండియా టీ20 కెప్టెన్ మరోసారి నిరాశపరిచాడు. ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో పెద్దగా రాణించలేకపోతున్న సూర్య.. ఆసియాకప్ ఫైనల్‌కు ముందు శ్రీలంకతో మ్యాచ్ ద్వారా టచ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అతడు మరోసారి తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. ఓ పక్క వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే.. క్రీజులో ఉన్నంత సేపు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యాడు. తీరా జోరు పెంచాల్సిన సమయంలో పెవిలియన్ చేరిపోయాడు. శ్రీలంకతో జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో 13 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్.. కేవలం 12 రన్స్‌ మాత్రమే చేశాడు.ఆసియాకప్‌ 2025లో తేలిపోతున్న సూర్య..ఆసియాకప్ 2025లో సూర్యకుమార్ యాదవ్ ఐదు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కు దిగాడు. ఇందులో 7* (2), 47* (37), 0 (3), 5 (11), 12 (13) స్కోర్లు నమోదు చేశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 47 పరుగులు చేసినా.. అది లోస్కోరింగ్ మ్యాచే. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా టీ20 జట్టు పగ్గాలు అందుకున్న సూర్య.. 2025లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కు దిగిన అతడు.. 99 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్‌ కూడా 110గానే ఉంది.ఇక శ్రీలంకతో మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది భారత్. ఈ టోర్నీలో పరుగుల వరద పారిస్తున్న అభిషేక్ శర్మ మరోసారి సత్తాచాటాడు. వరుసగా మూడో హాఫ్ సెంచరీ కొట్టాడు. 31 బంతుల్లో 61 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. తిలక్ వర్మ (34 బంతుల్లో 49 రన్స్‌ నాటౌట్‌), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39 రన్స్‌) రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్.. 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 203 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.శ్రీలంక బౌలర్ల మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, వానిందు హసరంగ, దసున్ శనక, చరిత్ అసలంక ఒక్కో వికెట్ తీశారు.