: దసరా పండగ సందర్భంగా మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? లు భారీగా తగ్గాయని జువెలరీ దుకాణాలకు వెళ్తున్నారా? అయితే మీకో అలర్ట్. దేశీయంగా బంగారం రేటు తగ్గినట్లే తగ్గి మళ్లీ భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, దేశీయంగా దసరా పండగ గిరాకీ సహా భౌగోళిక రాజకీయ అంశాలు బంగారం రేట్లు పెరిగేందుకు కారణమవుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా వరుసగా రెండోరోజూ పసిడి రేట్లు పెరిగాయి. దీంతో మళ్లీ రికార్డ్ గరిష్ఠ స్థాయులను తాకేందుకు పరుగులు పెడుతున్నాయి. ఇక మహిళలు ఆభరణాలు కొంటుంటారు. ఈ క్రమంలోనే ధరలు పెరగడం కొనుగోలుదారులకు షాక్ అనే చెప్పాలి. మరి సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజు బంగారం రేట్లు ఎంత పలుకుతున్నాయనేది తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు మళ్లీ భారీగా పెరిగాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు (31.10 గ్రాములు) 20 డాలర్ల మేర దూసుకెళ్లింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర 3759 డాలర్ల స్థాయికి ఎగబాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.79 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్స్ వెండి 46 డాలర్ల మార్క్ దాటింది. హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన బంగారం ధరహైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం రేటు వరుసగా రెండో రోజూ పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు క్రితం రోజు రూ.440 మేర పెరగగా ఈరోజు రూ.600 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ. 1,15,480 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు రెండ్రోజుల్లోనే రూ.950 మేర పెరిగింది. ఈరోజు ఒక్కరోజే రూ.550 మేర పెరగడంతో తులం ధర రూ.1,05,850 వద్దకు చేరింది. భారీగా పెరిగిన వెండి రేటుఇవాళ ఒక్కరోజే కిలో రూ.3000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1,59,000 స్థాయికి చేరుకుంది. అయితే, ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,49,000 స్థాయిలో ట్రేడవుతోంది. ఈ కథనంలోని బంగారం, వెండి రేట్లు సెప్టెంబర్ 28వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, మధ్యాహ్నం సమయానికి గోల్డ్ రేట్లు మారవచ్చు. జీఎస్టీ వంటి పన్నులు లెక్కలోకి తీసుకుంటే ధరలు ప్రాంతాల వారీగా మారతాయి. కొనే ముందు తెలుసుకోవడం మంచిది.