ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రూ.400 కోట్లు విడుదల

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వారికి బకాయిల విషయంలో ఉపశమనం కల్పించింది. 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో ఉన్నత విద్య పూర్తిచేసిన అనగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి బకాయిలకు సంబంధించి రూ.400 కోట్లు విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే దీనిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు కాలేజీల ఖాతాల్లో జమ అవుతాయి. అయితే, 2023-24 విద్యా సంవత్సరం ఫీజు బకాయిలు మాత్రం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, చాలా కాలేజీలు ఇప్పటికే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశాయని ప్రభుత్వం సర్వేలో తేలింది.ప్రభుత్వం ఈ నిధుల విడుదలకు సంబంధించి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనల్ ఇయర్ చదువుతన్న, పూర్తి చేసిన సంబంధించిన రూ.400 కోట్లను విడుదల చేస్తోంది. ఈ మొత్తంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేస్తారు.అయితే, 2023-24 విద్యా సంవత్సరానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. అప్పటి నిబంధనల ప్రకారం, ఫీజులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ కావాలి. కానీ, కొన్ని కాలేజీలు తమకు ఫీజులు ఇవ్వాలని కోరాయి. తాము ఫీజులు కట్టకపోయినా సర్టిఫికెట్లు ఇచ్చామని అవి చెప్పాయి. అయితే దీనిపై ప్రభుత్వం సర్వే చేయించగా.. చాలా కాలేజీలు ఇప్పటికే విద్యార్థుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేశాయని తెలిసింది. అందుకే, 2023-24 విద్యా సంవత్సరం ఫీజులను తల్లుల ఖాతాల్లోనే జమచేసే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో అనేక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వానికి కన్నా ముందు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నేరుగా కాలేజీల అకౌంట్లో జమ చేసేవారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంలో మార్పులు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో కాకుండా.. విద్యార్థుల తల్లుల అకౌంట్లలో తల్లుల జమ చేసేది. అప్పుడు విద్యార్థుల తల్లులు ఆ మొత్తాన్ని కాలేజీకి చెల్లించేవారు. ఆపై విద్యార్థి, వారి తల్లి పేరు మీద జాయింట్ అకౌంట్ ఒపెన్ చేసి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆ ఖాతాలో జమ చేసేవారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధానంలో మార్పులు చేసింది. విద్యార్థుల తల్లులు ఇచ్చిన గడువులోగా ఫీజు కట్టకపోతే.. విద్యార్థులు ఇబ్బంది పడతారని గ్రహించి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను డైరెక్టుగా కాలేజీయాజమాన్యాల అకౌంట్లలోనే జమ చేసేలా మార్పులు చేసింది.