లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు షాకిచ్చిన కెనడా.. ఉగ్రవాద సంస్థగా గుర్తింపు

Wait 5 sec.

భారత్‌తో పాటు విదేశాల్లో డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా, బెదిరింపులు, హత్యలతో సంబంధాలు ఉన్న షాకిచ్చింది. బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా కెనడా ప్రకటించింది. క్రిమినల్ కోడ్ ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్టు కెనడా హోం శాఖ మంత్రి గ్యారీ ఆనందసంగరీ సోమవారం ప్రకటించారు. దీంతో కెనడాలోని బిష్ణోయ్ ముఠా ఆస్తులు (నగదు నుంచి వాహనాలు, ఆస్తి వరకు) స్వాధీనం చేసుకోవడం లేదా స్తంభింపచేయడానికి, ఉగ్రవాద కార్యకలాపాలను నిధులు సమకూర్చడం వంటి వివిధ నేరాలపై ముఠా సభ్యులను విచారించడానికి చట్టబద్దమైన అధికారం దఖలుపడుతుంది. అంతేకాదు, ఈ గ్యాంగ్ సభ్యులకు కెనడాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు. ఇటీవల ఈ ముఠాయే బాధ్యత వహించింది.‘కెనడాలో ఉగ్రవాదం, హింసకు స్థానం లేదు.. ముఖ్యంగా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని భయపెట్టడం, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే వాటికి స్థానం లేదు.’’ అని కెనడా ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కెనడా చట్టం ప్రకారం.. ఇప్పుడు చెందిన లేదా వారి ఆధీనంలో ఉన్న ఆస్తులను గుర్తిస్తారు. ఎవరైనా లావాదేవీలు నిర్వహించినా అది నేరంగా పరిగణిస్తారు. అలాగే, ఆ గ్యాంగ్‌ను వినియోగించుకోవడం లేదా వారికి లబ్ది చేకూర్చేందుకు ఉపయోగపడుతుందని తెలిసి నేరుగా గాని పరోక్షంగా గాని ఆస్తి ఇవ్వడం కూడా నేరమే. ఈ ప్రకటనను ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు భారత్-కెనడా మధ్య జరిగిన దౌత్య యుద్ధం తర్వాత ఇరు దేశాల సంబంధాలను సరిదిద్దుకునే ప్రయత్నంలో కీలక అడుగుగా భావించాలి. ఇదే సమయంలో కెనడా ఎంపీ ఫ్రాంక్ కపుటో బిష్ణోయిపై ‘ఉగ్రవాద సంస్థ’గా గుర్తించాలని మంత్రి అనందసంగరీని కోరిన నెల రోజుల్లోనే ఈ ప్రకటన రావడం చెప్పుకోదగ్గ అంశం.హోం శాఖ మంత్రికి రాసిన లేఖలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దురాగతాలను, విస్తృత క్రిమినల్ సామ్రాజ్యాన్ని కపుటో ఏకరువు పెట్టారు. అతడు ఓ భయంకర నేర చక్రవర్తి అని, ఈ గ్యాంగ్ హత్యలు, కెనడా పౌరులపై దోపిడీలకు పాల్పడిందని, ఇంకా రాజకీయ, మతపర, సిద్ధాంతపర కారణాల కోసం ఇలాంటి అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. ‘బిష్ణోయి గ్యాంగ్ కార్యకలాపాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించేందుకు పునాది. వారు కెనడా, విదేశాల్లో జరిగిన విస్తృత హింసకు బాధ్యత వహించినట్టు స్వయంగా ప్రకటించారు’ అని కపుటో తన లేఖను ఎక్స్‌ (ట్విట్టర్) పంచుకున్నారు. అంతేకాదు, కెనడాలోని సిక్కుల్లో 20 శాతం మంది ఉండే బ్రాంప్టన్ నగర మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్, బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఇబే, అల్బెర్ట్ నే డానియల్ స్మిత్, సర్రే మేయర్ బ్రెండే లాకే వంటి రాజకీయ నాయకులను బిష్ణోయ్ గ్యాంగ్‌పై చర్యలు తీసుకోవాలని అభ్యర్తించారు.