ఒక ఫ్లాట్‌ ధర రూ. 500 కోట్లు.. రియల్ ఎస్టేట్‌లో సంచలనం.. భారీ ఆదాయంపై కన్ను!

Wait 5 sec.

: సాధారణంగా ఫ్లాట్ ధరలు ఎంత ఉంటాయి. కనీసం రూ. 1 కోటి, 2 కోట్ల నుంచి ప్రారంభమవుతాయని అనుకున్నా.. అత్యంత విలాసవంతంగా ఉండాలంటే.. 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు ఇలా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఒక ఫ్లాట్ ధర ఏకంగా రూ. 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లకు చేరాయి. దేశంలోని రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ.. లిమిటెడ్ ఇప్పుడు సంచలనం సృష్టించింది. పెట్టుకొని అల్ట్రా లగ్జరీ హౌసింగ్ విభాగంలోకి అడుగుపెట్టింది. అంతకుముందు గురుగ్రామ్‌లో డీఎల్ఎఫ్ కామెలియాస్ అపార్ట్‌మెంట్స్‌లో ఒక యూనిట్ ధర రూ. 100 కోట్లు పలికితేనే ఆశ్చర్యపోతే.. మరి ఇప్పుడు సన్‌టెక్ ఒక్కో ఫ్లాట్‌కు రూ. 500 కోట్ల ధర నిర్ణయించగా.. ఇప్పుడెంత ఆశ్చర్యపోతారో మరి..?సన్‌టెక్ రియాల్టీ ఇప్పుడు ఎమాన్సే అని సరికొత్త బ్రాండ్‌ను పరిచయం చేసింది. ఇది విశాలం (Immense), విలాసం (Indulgence) అనే 2 పదాల కలయికలో రూపొందించారు. ఇక్కడ ఎమాన్సే బ్రాండ్ కింద నిర్మితమయ్యే రెసిడెన్సీలు బై ఇన్వైట్ ఓన్లీ అనే పద్ధతిలోనే విక్రయిస్తారు. ఇక్కడ అపార్ట్‌మెంట్లో ఒక్కో యూనిట్ కనీసం రూ. 100 కోట్లకు కూడా తగ్గకుండా ఉంటుందని చెప్పారు సన్‌టెక్ రియాల్టీ సీఎండీ కమల్ ఖేతన్. గరిష్టంగా రూ. 500 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు.రియాల్టీ రంగంలోనే ఈ . ముంబైలోని నీపెన్సీ రోడ్ సహా దుబాయ్‌ విషయానికి వస్తే.. దుబాయ్ డౌన్‌టౌన్, బుర్జ్ ఖలీఫా కమ్యూనిటీలో నిర్మించనున్నారు. దుబాయ్‌లో.. ఇదే సన్‌టెక్ రియాల్టీకి తొలి భారత్ వెలుపలి ప్రాజెక్టు. 2026 జూన్ నాటికి ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 2 అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టుల ద్వారా ఏకంగా రూ. 20 వేల వరకు ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ. 2.5 లక్షలకుపైనే ఉంటుంది. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాలుగా, నిర్మాణాల్లో ఒకటిగా నిలవనుంది.సన్‌టెక్ రియాల్టీ సంస్థ విషయానికి వస్తే.. దేశంలోని టాప్ రియల్టర్లలో ఇదొకటి. సుమారు 52.5 మిలియన్ చదరపు అడుగుల మేర అభివృద్ధి పోర్ట్‌ఫోలియోను కలిగిఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సంస్థ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 47 శాతం పెరిగి రూ. 33.43 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ. 328 కోట్ల నుంచి రూ. 201 కోట్లకు తగ్గింది.