మహిళలకు దసరా పండగ ఆఫర్.. 15 రకాల సరుకులు రూ.వెయ్యి మాత్రమే

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో మాహిళా మార్టులు ఉన్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో ఈ మహిళా మార్టులు విజయవంతంగా నడుపుతున్నారు. డ్వాక్రా మహిళలు అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ మార్టుల్ని నడిపిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మహిళా మార్టు నడుపుతున్న సభ్యులు దసరాకు బంపరాఫర్ ప్రకటించారు. రూ.వెయ్యికే 15 రకాల సరుకుల్ని అందజేస్తున్నారు. వీరఘట్టం మహిళా మార్టు, స్థానిక మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దసరా, దీపావళి పండుగల కోసం సరకుల పంపిణీ జరుగుతోంది.పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండల సమాఖ్యలకు వీరఘట్టం మహిళా మార్టు నుంచి 5,000 దసరా ప్యాకెట్లు రూ.1000 చొప్పున రూ.50 లక్షల విలువైన సరకులు సిద్ధం చేస్తున్నారు. దీని కోసం 5,000 మంది మహిళలు ఇప్పటికే డబ్బులు చెల్లించారు. దీపావళికి కూడా రూ.20 లక్షల విలువైన సరకులకు 2,000 మంది మహిళలు ముందస్తు చెల్లింపులు చేశారు. మరో రూ.60 లక్షల అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సరకులను పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు.ద్వారా పంపిణీ చేసే కిట్‌లో మొత్తం 15 రకాల సరకులు ఉంటాయి. పంచదార (కిలో), జీడిపప్పు (100గ్రాములు), సేమియా (850 గ్రాములు), ఆయిల్‌ (లీటర్‌ ప్యాకెట్), బాస్మతీ బియ్యం (కిలో), కిస్మిస్‌ (100గ్రాములు), శనగ (అర కిలో), శనగపప్పు (కిలో), బెల్లం (కిలో), గోధుమపిండి (కిలో), గోధుమనూక (అర కిలో), టీ పౌడర్‌ (200 గ్రాములు), పసుపు (200 గ్రాములు), పెసరపప్పు (అర కిలో), ఉప్పు (కిలో) ఈ సరకులన్నిటిని కలిపి ఒక కిట్‌గా సిద్ధం చేస్తున్నారు. వీరఘట్టం మండలంలోని 50 గ్రామ సంఘాలకు చెందిన అధ్యక్షులు, వీవోఏలు ప్యాకింగ్‌ పనులు జరుగుతున్నాయి. వీరఘట్టం మహిళా మార్టు ద్వారా సరఫరా చేసే సరుకులకు గిరాకీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వీరఘట్టం మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె.లలితకుమారి చెప్పారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే ఈ సరుకులను అందిస్తామని ఆమె తెలిపారు. ఈ సరుకులను మొదట నేరుగా మండల మహిళా సమాఖ్యలకు ఇస్తారు. అక్కడి నుండి గ్రామ సంఘాలకు సరఫరా చేస్తారు.