6 నెలల్లోనే 107 శాతం లాభం.. ఇప్పుడు 30 షేర్లు ఉచితంగా ఇస్తోన్న కంపెనీ..!

Wait 5 sec.

: స్మాల్ క్యాప్ కేటగిరిలోని క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ సంస్థ వివియానా పవర్ టెక్ లిమిటెడ్ () తమ వాటాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 25న కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశమై బోనస్ షేర్లు అందించేందుకు ఆమోదం తెలిపారు. దీంతో ఉచితంగా షేర్లు లభిస్తాయి. ఇప్పుడు ఈ స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. 50 షేర్లు కొనుగోలు చేసి ఉంటే ఉచితంగా 30 షేర్లు లభిస్తాయి. మరోవైపు ఈ కంపెనీ స్టాక్ గత ఆరు నెలల్లోనే 107 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. సెప్టెంబర్ 25 రోజున వివియానా పవర్ టెక్ లిమిటెడ్ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై 3:5 రేషియోలో బోనస్ షేర్లు అందించేందుకు ఆమోదం తెలుపారు. దీని అర్ధం రికార్డు తేదీ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 5 ఈక్విటీ షేర్లను తమ డీమ్యాట్ ఖాతాలో కలిగి ఉన్నవారికి అదనంగా రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉండే 3 ఈక్విటీ షేర్లను ఉచితంగా బోనస్ రూపంలో ఇస్తారు. శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్లో వివియానా పవర్ టెక్ షేరు 0.3 శాతం లాభంతో రూ. 1566.70 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1705, 52 వారాల కనిష్ఠ ధర రూ. 598 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ స్టాక్ 3 శాతం లాభాన్ని ఇచ్చింది. గత నెల రోజుల్లో 33 శాతం లాభాన్ని అందించింది. గత ఆరు నెలల్లో 107 శాతం పెరిగింది. లక్ష రూపాయల పెట్టుబడిని డబుల్ చేస్తూ రూ.2.07 లక్షలు అందించింది. గత ఏడాది కాలంలో 87 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఐదేళ్ల కాలంలో 1641 శాతం లాభాన్ని అందించింది. ఈ కథనం సమాచారం అందించేందుకే తప్పితే ఎలాంటి పెట్టుబడులు పెట్టాలని సూచించేందుకు కాదు. స్టాక్ మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందే ఎంచుకున్న స్టాక్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. నిపుణుల సలహా తీసుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టాలు రాకుండా చూసుకోవచ్చు.