బిగ్‌బాస్ ప్రోమో: వాళ్లిద్దరినీ కట్ చెయ్.. నీ కోసం నువ్వు ఆడు.. రీతూ చౌదరికి తల్లి స్ట్రాంగ్ మెసేజ్

Wait 5 sec.

దసరా స్పెషల్ అంటూ బిగ్‌బాస్ సండే ఎపిసోడ్ రాత్రి 7 గంటలకే ప్రసారం కాబోతుంది. ఈ ఎపిసోడ్‌లో పలువురు గెస్టులతో పాటు కొన్ని పెర్ఫామెన్స్‌లు కూడా ఆకట్టుకోబోతున్నాయి. తెలుసు కదాా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సిద్ధూ జొన్నలగడ్డ, హీరోయిన్లు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి షోకి వచ్చారు. ఇక వీళ్లతో సినిమా గురించి అలానే పలు పర్సనల్ విషయాల గురించి నాగార్జున ఇంట్రెస్టింగ్ కొశ్చన్స్ అడిగారు.అలానే కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ కె ర్యాంప్ ప్రమోషన్స్‌ కోసం హీరోయిన్‌ని తీసుకొని వచ్చారు. మరోవైపు కోర్ట్ మూవీ ఫేమ్ శ్రీదేవి, హర్ష్ రోషన్ కూడా స్పెషల్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలానే దేత్తడి హారిక తన డ్యాన్స్‌ని అందరినీ ఫిదా చేసింది. పండగ కావడంతో హౌస్‌మేట్స్ అందరితో ఫన్నీ గేమ్స్ ఆడించారు నాగార్జున. ఇందులో గెలిచిన ఇమ్మానుయేల్ టీమ్‌కి నాగ్ ఒక ఆఫర్ ఇచ్చారు.దేని కోసం వచ్చావో అది చెయ్ఇమ్మానుయేల్ మీ టీమ్‌లో ఈ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలో నువ్వే డిసైడ్ చెయ్.. అని నాగ్ అడగ్గా రీతూకి ఇవ్వండి సార్ అంటూ సమాధానమిచ్చాడు. దీంతో నీకేం కావాలో చెప్పు అని నాగార్జున అడిగారు. నాకు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడియో మెసేజ్ కావాలని రీతూ అడిగింది. దీంతో తన తల్లి నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్‌ని ప్లే చేయించారు నాగార్జున."హలో అమ్ములు నేను ఇక్కడ బానే ఉన్నాను.. నీ గేమ్ నీ కోసమే ఆడుకో నాన్న.. ఎవరికోసమో కాదు నువ్వు వెళ్లింది.. నీకు తెలుసు దేని గురించి అంటున్నానో కొంచెం అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను.." అంటూ రీతూ చౌదరిని ఉద్దేశించి తన తల్లి మాట్లాడారు. ఈ మాటలు వింటున్నప్పుడు రీతూ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసి ఆమె ఏమంటున్నారో డెఫినెట్‌గా నీకు అర్థమై ఉంటుంది.. అంటూ నాగార్జున కూడా అన్నారు.అయితే రీతూ తల్లి, నాగ్ చెప్పిన విషయం ఏంటో ఆడియన్స్‌కి కూడా ఇట్టే అర్థమైంది. హౌస్‌కి కప్పు కోసం వచ్చిన రీతూ అది మానేసి కళ్యాణ్, డీమాన్‌తో రాసుకుపూసుకొని తిరుగుతుంది. ఇక వీళ్లు కూడా ఎక్కడ రీతూని వదలకుండ వెనకాల తిరుగుతూనే ఉన్నారు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ . చేతులు పట్టుకొని కూర్చోవడం కాదు ఆట కూడా ఆడాలి అంటూ నాగ్ అన్నారు. ఇప్పుడు రీతూకి కూడా తన తల్లి ఇదే విషయంపై చురకలు అంటించింది. మరి రీతూ ఇప్పటికైనా మారుతుందా లేక అలానే ఉంటుందా చూడాలి.