ఏపీకి భారీగా పెట్టుబడులు.. 15 నెలల కాలంలోనే రూ.10,600 కోట్లు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయని.. రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి గమ్యస్థానంగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే సుమారు 103 పర్యాటక ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకున్నామని.. రూ.10,600 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చామని తెలిపారు. అలానే రానున్న రోజుల్లో 50 వేల గదులు, 10 వేల తీసుకురాబోతున్నట్లు తెలిపారు.ఈ సదర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రానున్న భవిష్యత్తు అంతా ఆధారపడి ఉండబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2024-29 పర్యాటక విధానం తీసుకొచ్చాం.. రాయితీలు అందిస్తామని తెలిపారు. రానున్న నాలుగు సంవత్సరాల్లో పర్యాటక రంగంలో ఎకో సిస్టమ్‌ని తీసుకొస్తామని తెలిపారు. ఈ రంగంలోని అన్ని సర్వీసులను కృత్రిమ మేథకు అనుసంధానిస్తామని తెలిపారు. అలానే స్మార్ట్ టూరిజం యాప్‌ను కూడా తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి.. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. దీనిలో భాగంగా అరకువ్యాలీ, విశాఖ, తిరుపతి, రాయలసీమ, కోనసీమలో ఉన్న హోంస్టేలను వినియోగించుకుని.. ఆ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యాటక రంగం వల్ల వ్యక్తిగత ఆదాయంతో పాటు తలసరి ఆదాయం కూడా పెరుగుతాయని చెప్పుకొచ్చారు. అమెరికాలో కేవలం పర్యాటక రంగం వల్ల 2.36 ట్రిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుండగా.. మన దేశంలో మాత్రం 231 బిలియన్‌ డాలర్లు మాత్రమే వస్తుంది అన్నారు. ప్రతి రోజు లక్షల మంది తిరుమలకు వస్తున్నారు. అయితే వారు కేవలం దర్శనం చేసుకుని.. ఒక్కరోజు ఉండి వెళ్లి పోతున్నారు. అలా కాకుండా వారు తిరుపతిలోనే కనీసం మూడు రోజులు ఉండేలా కార్యక్రమాలు రూపొందిచబోతున్నాము. అనలానే తిరుపతి, అన్నవరం ప్రాంతాలను వివాహ వేదికలుగా మార్చబోతున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో 40 బౌద్ధ స్థలాలు అభివృద్ధి చేయడమే కాక.. 100 ఆలయాల్లో చెప్పుకొచ్చారు. అలానే కేంద్ర ప్రభుత్వం 422 కోట్లతో 8 పర్యాటక ప్రాజెక్టులు మంజూరు చేసిందన్నారు. వీటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తయారు చేస్తామని చెప్పుకొచ్చారు.