విజయవాడ నగరవాసులు సరికొత్త థ్రిల్ ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి. అభివృద్ధి కోసం ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఈ మూలపాడు నగరవనం అటు విజయవాడకు, ఇటు అమరావతికి దగ్గర్లో ఉండటంతో నగరవనం అభివృద్ధి మీద ఏపీ అటవీశాఖ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీనికి తోడు మూలపాడు నుంచి అమరావతికి ఐకానిక్ వంతెన నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఇది పూర్తి అయితే ఈ మూలపాడు నగరవనానికి సందర్శకుల తాకిడి పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నగరవనంలో మరిన్ని సౌకర్యాలు కల్పించనుంది. నగరవనం సందర్శనకు వచ్చే పర్యాటకులు ట్రెక్కింగ్‍‌తో పాటుగా ఇక్కడున్న వాతావరణాన్ని ఎంజాయ్ చేసేలా కొత్త సౌకర్యాలు కల్పించనుంది.* మూలపాడు నగరవనం సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం జంగిల్ సఫారీ అందుబాటులోకి తేనున్నారు. ప్రత్యేకమైన వాహనంలో అడవి మొత్తం తిప్పి చూపించనున్నారు. విజయదశమి నుంచి ఈ జంగిల్ సఫారీ అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది. ఈ ప్రత్యేక వాహనాలను కూడా ఒక్కో వాహనంలో 13 మంది కూర్చునేలా డిజైన్ చేశారు. ఆంజనేయస్వామి ఆలయం వరకు జంగిల్ సఫారీకి అనుమతి ఉంది. అక్కడికి 700 మీటర్ల దూరంలో జలపాతం ఉంది. జలపాతం అందాలను కూడా పర్యాటకులు వీక్షించవచ్చని అధికారులు చెప్తున్నారు.*మరోవైపు మూలపాడు నగరవనంలో అడ్వెంచర్ టూరిజం ప్రోత్సహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేయనున్నారు.ఈ జిప్ లైనర్‌ను దీపావళి నాటికి ఏర్పాటుచేసేలా చర్యలు చేపడుతున్నారు. రెండు కొండల మధ్యన 400 మీటర్ల పొడవుతో ఈ జిప్ లైనర్ ఉంటుంది. ఓ కొండపై జిప్ లైనర్ ఎక్కే పర్యాటకులు దీని ద్వారా మరో కొండపైకి చేరుకుంటారు. అలాగే కూడా అందుబాటులోకి తేనున్నారు. *వీటితో పాటుగా సైక్లింగ్ ట్రాకులు, వాకింగ్ ట్రాకులు, ట్రెక్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇక్కడున్న చెరువులో బోటింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి తేనున్నారు. చెరువు ఒడ్డున వ్యూపాయింట్ ఏర్పాటుచేసి.. సూర్యోదయం, సూర్యాస్తమయం ప్రకృతి అందాలను వీక్షించేలా చేయాలని ఆలోచన చేస్తున్నారు.