తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 తుది ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 783 పోస్టుల భర్తీకి చేపట్టిన ఈ ప్రక్రియలో, 782 మంది అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేసినట్టు కమిషన్ వెల్లడించింది. ఒక్క పోస్టు మాత్రం సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉంచినట్లు తెలిపింది. ఈ గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రక్రియ 2022లోనే ప్రారంభమైంది. దీని కింద 2024 డిసెంబరులో రాత పరీక్షలు నిర్వహించగా.. అనంతరం 2024 మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితా వెలువడింది. తర్వాతి దశలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన (Documents Verification) కార్యక్రమం పూర్తి చేశారు. ఇప్పుడు.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తుది ఫలితాలను TSPSC విడుదల చేయడం విశేషం. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర పరిపాలనలో కీలకంగా పనిచేసే డిప్యూటీ తహసీల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II, ఇతర విభాగాల్లో ఉన్నత హోదాలో ఉన్న అధికార పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ నియామకాలతో ప్రభుత్వ పరిపాలన మరింత సమర్థవంతంగా.. వేగవంతంగా సాగనుంది. ఈ గ్రూప్-2 పరీక్షకు లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ఉద్యోగాలను పొందేందుకు అభ్యర్థులు రాత్రింబవళ్లు శ్రమించి విజయం సాధించారు. ఈ ఫలితాలు అనేక కుటుంబాల్లో ఉజ్వల భవిష్యత్తుకు నాంది కావడం గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందుండిన ప్రధాన నినాదాల్లో “ఉద్యోగాలు – నీళ్లు – నిధులు” అన్నది ముఖ్యమైనది. ఈ గ్రూప్-2 నియామకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్ష్యాలకు మద్దతుగా మరో అడుగు ముందుకు వేసినట్టు భావించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి తదుపరి సూచనలు, నియామక ప్రక్రియ వివరాల కోసం TSPSC అధికారిక వెబ్‌సైట్ (www.tspsc.gov.in) ను నిరంతరం పర్యవేక్షించాలని కమిషన్ సూచించింది. వైద్య పరీక్షలు, జాయినింగ్ ఆదేశాలు, పోస్టింగ్‌లకు సంబంధించిన సమాచారం తదితరాలన్నీ అక్కడే అందుబాటులో ఉంటాయని తెలిపింది. గ్రూప్ 1 నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి నిన్న అభ్యర్థులకు అందజేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే రావడం విశేషం. ఇక గ్రూప్ 2 నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా అందిన తర్వాత గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను చెక్ చేసుకోండిలా.. మొదటగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. దాని చేయండి. అక్కడ గ్రూప్ 2 ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ పై క్లిక్ చేయండి. అక్కడ చేసుకోవచ్చు.