Fixed Deposit Interest Rates: మనలో ప్రతి ఒక్కరూ.. సంపాదించిన మొత్తంలో నుంచి.. మరింత డబ్బు సృష్టించాలని అనుకుంటుంటారు. ఇందుకోసం.. డబ్బు ఆదా చేస్తూ.. పెట్టుబడులు పెడుతుంటారు. పెట్టుబడుల విషయానికి వస్తే.. రిస్క్ ఉన్నవి, లేనివీ రెండు రకాలుగా ఉంటాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి అయితే.. రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇస్తాయని నమ్ముతుంటారు. ఇంకా.. స్థిరమైన రిటర్న్స్ కోసం పోస్టాఫీస్ పథకాలు, గోల్డ్ ఇలా వీటిని ఎంచుకుంటుంటారు. ఇక సీనియర్ సిటిజెన్స్ విషయానికి వస్తే.. వీరు పెద్దగా రిస్క్ కోరుకోరు కాబట్టి ఎక్కువగా సంప్రదాయ పె. ఇప్పుడు మనం సీనియర్ సిటిజెన్లకు అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల గురించి చూద్దాం. ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తున్న నేపథ్యంలో.. బ్యాంకులు కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఇటీవలి కాలంలో తగ్గిస్తూ వచ్చాయి. దీంతో ఒకప్పటి కంటే రాబడి తగ్గింది. అయినా వీటి నుంచి జనం పెద్దగా బయటికి పోరు. సీనియర్ సిటిజెన్లకు.. సాధారణ ప్రజల కంటే దాదాపు 50 బేసిస్ పాయింట్ల వరకు అధిక వడ్డీ కూడా వస్తుంటుంది. ఇంకా చాలా మంది ఐదేళ్ల వరకు వ్యవధిపై డిపాజిట్లు చేస్తుంటారు.>> ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తున్నా.. ఇప్పటికీ కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజెన్లకు ఎక్కువ వడ్డీనే ఆఫర్ చేస్తున్నాయి. ఐదేళ్ల వ్యవధి డిపాజిట్లపై ఇప్పుడు రూ. 3 కోట్ల లోపు విలువైన ఎఫ్‌డీపై.. గరిష్టంగా 8.4 శాతం వరకు వడ్డీ వస్తుంది. ముందుగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఐదేళ్ల టెన్యూర్‌పై సీనియర్ సిటిజెన్లకు అత్యధికంగా 8.40 శాతం వడ్డీ వస్తుంది. ఇక్కడ రూ. 1 లక్ష జమ చేస్తే.. ఐదేళ్లకు సుమారు రూ. 51,536 వడ్డీ వస్తుంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో చూస్తే.. ఇక్కడ అత్యధికంగా 8 శాతం వడ్డీ రేటు ఉంది. దీంట్లో రూ. 1 లక్ష డిపాజిట్ చేసిన వారికి మెచ్యూరిటీకి రూ. 48,595 వడ్డీ వస్తుంది.చివరగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఇక్కడ వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంది. దీంట్లో ఒక లక్ష జమ చేస్తే.. ఐదేళ్లకు రూ. 46,784 వడ్డీ వస్తుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్లపై డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) కింద రూ. 5 లక్షల వరకు గ్యారెంటీ ఉంటుంది. అంటే.. బ్యాంకులో ఏమైనా జరిగినా.. ఆర్బీఐ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినా.. ఇంకేమైనా ఆంక్షలు తీసుకున్నా.. గరిష్టంగా రూ. 5 లక్షల వరకు కస్టమర్ల డబ్బు వెనక్కి వస్తుందని చెప్పొచ్చు.