ఏంటీ.. వెండి ధర ఒక్కరోజే ఇన్ని వేలు పెరిగిందా.. రికార్డులన్నీ బద్ధలు!

Wait 5 sec.

Silver Performance 2025: ఈ ఏడాది బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా అనిశ్చిత సంకేతాలు ముఖ్యంగా రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు సహా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలు పెంచడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుండటం సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం ఇలా ఇవన్నీ బంగారం పెరిగేందుకు దోహదం చేశాయి. ఈ క్రమంలో ఇటువైపు పెట్టుబడులు పెట్టే వారి సంఖ్యా పెరిగింది. దీంతో రేట్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. .. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లి రికార్డులన్నీ బద్ధలు కొట్టింది. అంచనాలకు మించి ఇది దూసుకెళ్లడం గమనార్హం.ఇవాళ ఒక్కరోజే (సెప్టెంబర్ 27) వెండి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఏకంగా రూ. 6 వేలు పెరగడంతో ప్రస్తుతం కిలో హైదరాబాద్ నగరంలో రూ. 1.59 లక్షలకు చేరింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ వెండి ధర ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ప్రస్తుతం స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 46 డాలర్లపైన ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత 9 రోజుల్లో చూస్తే ఏకంగా రూ. 18 వేలు పెరిగింది. ఈ క్రమంలో రూ. 1.43 లక్షల నుంచి ప్రస్తుత స్థాయికి చేరింది. >> ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే కూడా.. వెండి అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టింది. బంగారం ధర 2025లో ఇప్పటివరకు 35 శాతం పెరిగితే.. వెండి అంతకుమించి 38 శాతం పెరగడం విశేషం. దీంతో.. చాలా మంది ఇన్వెస్టర్లు తాము మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నామని బాధపడాల్సి వచ్చింది. వెండి కేవలం పెట్టుబడి సాధనం మాత్రమే కాదు.. పారిశ్రామికంగా దీనికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతోనే దేశీయంగా దిగుమతులు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం మన దేశం.. ప్రపంచంలోనే అతిపెద్ద వెండి వినియోగదారుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచం గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీలో వెండి కీలక పాత్ర పోషిస్తోంది.ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఉద్రిక్తతల వేళ.. బంగారంతో సమానంగా వెండిపైనా పెట్టుబడులు పెడుతున్నారు. దీనిని సురక్షిత ఆస్తిగా భావిస్తున్నారు. బంగారంతో పోలిస్తే.. వెండి ధర కాస్త తక్కువగా ఉండటం కారణంగా.. చిన్న రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈజీగా ఇన్వెస్ట్ చేసేందుకు వెండిని ఎంచుకుంటున్నారు.