డ్వాక్రా మహిళలకు దీపావళి కానుక.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేస్కోండి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తోంది. ‘ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి’, ‘ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి’ పథకాలు డ్వాక్రా మహిళలకు అండగా నిలుస్తోంది.పిల్లల చదువులకు, ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తాయి. SERP (సెర్ప్) పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే వీటికి ఆమోదం తెలిపారు. గత వారం ప్రారంభం కావాల్సిన ఈ పథకాలు వాయిదా పడ్డాయి.. మరో పది రోజుల్లో ఇవి అమల్లోకి వస్తాయి. ‘ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి’ పథకం డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు సహాయం చేస్తుంది. ‘ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి’ పథకం వారి ఆడబిడ్డల వివాహాలకు చేయూతనిస్తుంది. ఈ పథకాల కింద లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణాలకు పావలా వడ్డీ మాత్రమే ఉంటుంది.. ఇది చాలా తక్కువ వడ్డీ. ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళకు పిల్లల చదువుల కోసం రుణాలు ఇస్తారు. కనీసం ఆరు నెలలు డ్వాక్రాలో ఉన్న, ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పులను సక్రమంగా చెల్లిస్తున్న వారు కూడా అర్హులు. బయోమెట్రిక్ ఆధారంగా ఈ రుణాలు ఇస్తారు. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు (గరిష్ఠంగా) రుణ సహాయం లభిస్తుంది. దరఖాస్తు చేసిన 48 గంటల్లో డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. గరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువుల కోసం ఈ రుణాన్ని తీసుకోవచ్చు. పాఠశాలలు, కళాశాలల్లో పిల్లల ఫీజులకు తగ్గట్టుగా అవసరమైన మొత్తాన్ని పొందవచ్చు. దీనికి 4% వడ్డీ (పావలా వడ్డీ) మాత్రమే ఉంటుంది. తీసుకున్న మొత్తాన్ని బట్టి వాయిదాల సంఖ్య మారుతుంది. గరిష్ఠంగా 48 వాయిదాల్లో తిరిగి చెల్లించాలి.. దరఖాస్తు చేసేటప్పుడు అడ్మిషన్‌ లెటర్, ఫీజు చెల్లింపు విధానం, ఇన్‌స్టిట్యూట్‌ వివరాలు, రసీదు సమర్పించాలి. ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణానికి 4% వడ్డీ (పావలా వడ్డీ అని కూడా అంటారు) ఉంటుంది.. గరిష్ఠంగా 48 వాయిదాలలో తిరిగి చెల్లించాలి. తీసుకున్న రుణ మొత్తాన్ని బట్టి వాయిదాల సంఖ్య మారుతుంది.లగ్న పత్రిక, ఈవెంట్‌ నిర్వహణ పత్రం, పెళ్లి ఖర్చుల అంచనా పత్రాలను సమర్పించాలి. పెళ్లి వివరాలను పరిశీలించిన తర్వాత, నగదును నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి పథకాల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.2000 కోట్లు ఖర్చు చేస్తుంది. ఒక్కో పథకానికి రూ.1000 కోట్ల చొప్పున కేటాయిస్తారు. ఈ రెండు పథకాల వచ్చే పావలా వడ్డీ ఆదాయాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు. ఇందులో 50 శాతం డబ్బును డ్వాక్రా సంఘాలకు ముఖ్యమైన మండల, గ్రామ సమాఖ్యలను బలోపేతం చేయడానికి వాడతారు. మిగిలిన 50 శాతం 'స్త్రీనిధి' ఉద్యోగుల ప్రయోజనాలకు కేటాయిస్తారు. ఈ పథకాల కింద రుణం తీసుకున్న సభ్యురాలు ప్రమాదవశాత్తు చనిపోతే, ఆమె రుణం మాఫీ అవుతుంది. వారి కుటుంబంపై భారం పడకుండా ఆ రుణ మొత్తాన్ని పూర్తిగా రద్దు చేస్తారు. ఇది సభ్యులకు ఒక పెద్ద భరోసా అని చెప్పొచ్చు.