ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో అరెస్టైన రాజంపేట ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మిథున్ రెడ్డికి ఊరట లభించింది. మద్యం కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల ష్యూరిటీ, వారానికి రెండుసార్లు సంతకం సహా షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టైన .. 71 రోజులుగా జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఆయన పలుసార్లు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. అయితే, సెప్టెంబరు 9న జరిగిన ఉప-రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేయడానికి రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పూర్తిస్థాయి బెయిల్ మంజూరు కావడంతో మిథున్ రెడ్డి.. మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది జులై 19న సిట్ అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. తాజాగా, మిథున్‌ రెడ్డి బెయిల్ రావడంతో ఇప్పటి వరకూ ఈ కేసులో ఐదుగురికి బెయిల్ వచ్చినట్టు య్యింది.