పోస్టాఫీస్ పథకాలకు కొత్త వడ్డీ రేట్లు.. సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బ్యాడ్‌న్యూస్!

Wait 5 sec.

Post Office Small Savings Rate Cut: మనకు పెట్టుబడుల కోసం ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్ సహా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు వంటివి ఉన్నాయి. అయితే.. ఇక్కడ స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉన్నా.. వీటిల్లో కాస్త రిస్క్ ఉంటుందని చెప్పొచ్చు. అందుకే సంప్రదాయ పెట్టుబడి పథకాలైన డిపాజిట్లు, పోస్టాఫీస్ చిన్న మొత్తాల వంటి వాటిని ఎంచుకుంటుంటారు. ఇక్కడ నిర్దిష్ట మొత్తం పెట్టుబడిపై నిర్దిష్ట కాల పరిమితిపై నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం.. రాబడి ఉంటుంది. అందుకే వీటి పట్ల జనం ఆసక్తి ఎక్కువ ఉంటుంది. >> ఈ పోస్టాఫీస్ పథకాల్లో , సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, , నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఇలా చాలానే స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో చిన్న మొత్తాల నుంచి ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండటం సహా కేంద్రం హామీగా ఉండటం.. గ్యారెంటీ రిటర్న్స్ ఇస్తుండటం వల్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం.. ప్రతి 3 నెలలకు ఓసారి అంటే ప్రతి త్రైమాసికంలో కొత్త వడ్డీ రేట్లను ప్రకటిస్తుంటుంది. ఇప్పుడు జులై- సెప్టెంబర్ త్రైమాసికం ముగియబోతుండగా.. అక్టోబర్- డిసెంబర్ సమయానికి వడ్డీ రేట్లను ప్రకటించాల్సి ఉంది. దీనిపై నేడో, రేపో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గత కొంత కాలంగా కేంద్రం.. ఈ పథకాల వడ్డీ రేట్లను పెంచట్లేదు. తగ్గించట్లేదు. స్థిరంగానే ఉంచుతూ వస్తోంది. అయితే ఈ సారి మాత్రం ఈ పథకాల వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. >> ఈ సంవత్సరం ఆర్బీఐ కీలక రెపో రేట్లను 3 సార్లు తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలలో కలిపి ఏకంగా 100 బేసిస్ పాయింట్లు అంటే ఒక శాతం వడ్డీ రేట్లు తగ్గించింది. ఈ క్రమంలో బ్యాంకులు డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించేశాయి. >> పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు శ్యామలా గోపీనాథ్ కమిటీ సిఫార్సుల ప్రకారం.. పదేళ్ల కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల (G-Sec) సగటు రాబడిపై 25 బేసిస్ పాయింట్లు అదనంగా ఉండేలా నిర్ణయిస్తుంటారు. దీని ప్రకారం.. చూస్తే ప్రస్తుత పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో తగ్గించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇన్వెస్టర్లకు రాబడి మరింత తగ్గుతుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి పథకాల్లో వడ్డీ రేట్లు అత్యధికంగా 8.20 శాతంగా ఉండగా.. పీపీఎఫ్‌లో 7.10 శాతంగా ఉంది. NSC లో 7.7 శాతంగా ఉంది. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లో 4 శాతం, కిసాన్ వికాస్ పత్రలో 7.50 శాతంగా ఉన్నాయి. మంత్లీ ఇన్‌కం స్కీంలో 7.40 శాతంగా ఉంది.