టీ20 వరల్డ్‌కప్ గెలిచాక గంభీర్ ఎమోషన్.. ఆ ఇద్దరికీ ట్రోఫీ అంకితం

Wait 5 sec.

ను సొంతం చేసుకున్న తర్వాత చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల టెస్టు సిరీస్‌ల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయాల తర్వాత గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ విజయం అతనికి ఒక విధంగా సమాధానంగా మారింది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్ చరిత్రలో మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా నిలిచింది. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి మాట్లాడుతూ తనకు వాటితో సంబంధం లేదని స్పష్టం చేశాడు. “సోషల్ మీడియాలో ఉన్న వాళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా బాధ్యత ఆ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న 30 మందికే. ఒక కోచ్ తన జట్టు ఎంత గొప్పగా ఆడితే అంత గొప్పగా కనిపిస్తాడు. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది ఆటగాళ్లే” అని గంభీర్ అన్నాడు.తన కెరీర్‌లో ఒక గొప్ప విజయాన్ని సాధించిన ఈ సందర్భంలో కూడా గంభీర్ తనకు ముందున్న వ్యక్తులను మర్చిపోలేదు. ముఖ్యంగా మాజీ హెడ్ కోచ్ , బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్‌కు ఈ ట్రోఫీని అంకితం చేస్తున్నానని చెప్పాడు. “ఈ ట్రోఫీని నేను రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌కు అంకితం చేస్తున్నాను. రాహుల్ భాయ్ భారత జట్టును ఈ స్థాయికి తీసుకువచ్చాడు. అలాగే లక్ష్మణ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో యువ ఆటగాళ్లకు బలమైన మార్గాన్ని నిర్మించాడు” అని గంభీర్ వివరించాడు.అదే సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ఐసీసీ చైర్మన్ జై షాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా తన కోచింగ్ కాలంలో ఎదురైన కష్ట సమయంలో జై షా తనకు ఫోన్ చేసి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. “అజిత్ అగార్కర్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా నిజాయితీగా తన పని చేశాడు. అలాగే జై భాయ్‌కు కూడా కృతజ్ఞతలు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌లు ఓడిపోయిన తర్వాత నా కెరీర్‌లో అత్యంత కష్టకాలం వచ్చింది. ఆ సమయంలో నాకు ఫోన్ చేసి మాట్లాడిన వ్యక్తి ఆయనే” అని గంభీర్ చెప్పాడు. ఈ విజయానికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్రను కూడా గంభీర్ ప్రశంసించాడు. “సూర్య నా పని చాలా సులభం చేశాడు. అతను జట్టుకు ఒక తండ్రిలాంటి నాయకుడు. మనం వ్యక్తిగత రికార్డుల కంటే ట్రోఫీలను సెలబ్రేట్ చేసుకోవాలి. చాలా సంవత్సరాలుగా వ్యక్తిగత మైలురాళ్లను మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నాం. ఇక నుంచి జట్టు విజయాలను చేసుకోవాలి” అని గంభీర్ స్పష్టం చేశాడు.