స్థిరంగా బంగారం ధరలు.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఇవే

Wait 5 sec.

: బంగారం కొనుగోలుదారులకు ధరల పెరుగుదల నుంచి ఊరట లభించింది. గత వారం వరుసగా తగ్గుతూ వచ్చి నిన్నటి రోజున మళ్లీ వరుసగా పెరుగుతాయని ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, ఈరోజు పసిడి రేట్లు దేశీయంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గల్ఫ్ దేశాలపై దాడులు ఉండవని ఇరాన్ ప్రకటించింది. అయితే, తమపై దాడి చేసిన వారిని మాత్రం వదిలిపెట్టేది లేదని తెల్చేసింది. ఈ క్రమంలో యుద్ధం మరింత కాలం కొనసాగుతుందని తెలుస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. డాలర్ విలువ పుంజుకోవడమూ బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోంది. వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి రేట్లు క్రితం సెషన్‌లో ఒక్కసారిగా పెరిగాయి. అయితే, ఈరోజు స్వల్ప ఊరట కల్పిస్తూ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో మార్చి 9వ తేదీన 22, 24 క్యారెట్ల బంగారం రేటు ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు భారీగానే తగ్గాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు 72 డాలర్లకు పైగా తగ్గింది. దీంతో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5077 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 4.37 శాతం మేర పడిపోయింది. దీంతో వెండి ఔన్స్ రేటు 80.54 డాలర్ల వద్దకు చేరింది. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఏ మార్పు లేకుండా రూ. 1,50,000 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ. 1,63,640 వద్ద అమ్ముడవుతోంది. స్థిరంగానే వెండి రేటుఅయితే, గత వారం నుంచి తగ్గుతూనే వస్తోంది. కిలోపై రూ.30 వేలపైన తగ్గింది. ఈరోజు సైతం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2,90,000 పలుకుతోంది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు మార్చి 9వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, ధరలు మధ్యాహ్నానికి మారిపోవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానికంగా ఉండే ధరలను తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రాంతాలను బట్టి బంగారం ధరలు మారుతుంటాయి.