పెట్రోల్ ధర పెంపుపై చర్చ వేళ.. కేంద్రం నుంచి గుడ్‌న్యూస్.. ఏకంగా 4000 కోట్ల లీటర్లు!

Wait 5 sec.

Oil Reserves: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతారన్న ఆందోళన వేళ కేంద్రం నుంచి శుభవార్త వచ్చింది. ప్రస్తుతం ముడి చమురు, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 250 మిలియన్ బ్యారెళ్ల ఇంధన అంటే దాదాపు 4000 కోట్ల లీటర్ల ఆయిల్ నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. సరఫరా వ్యవస్థలో ఉన్న నిల్వలు 7-8 వారాలు అంటే రెండు నెలలకు పైగా సరిపోతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. మంగళూరు, పడూర్, విశాఖపట్నం ప్రాంతాల్లోని ఆయిల్ రిజర్వ్స్‌ సహా ట్యాంకులు, పైప్ లైన్లు, సముద్ర నౌకల్లో నిల్వలు ఉన్నట్లు తెలిపింది. దశాబ్దం క్రితం 27 దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుండగా ఇప్పుడు 40 దేశాల నుంచి భారత్‌కు ముడి చమురు వస్తోంది. హార్ముజ్ జల సంధి నుంచి కేవలం 40 శాతమే దిగుమతి అవుతోంది. మిగితా 60 శాతం రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, మధ్య ఆసియా దేశాల నుంచి వస్తోందని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. ఒకే సముద్ర మార్గంపై ఆధారపడి, ఇంధన భద్రతపై ఆందోళన చెందే రోజులు పోయాయని భరోసా కల్పించింది. సరఫరా అత్యవసర పరిస్థితులు తలెత్తవని తెలిపింది. రష్యా నుంచి ఆపలేదుతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా రష్యా చమురు కొనుగోళ్లకు ఏ దేశం అనుమతిపై భారత్ ఆధారపడలేదని తెలిపింది. గత నెలలోనూ రష్యా నుంచి చమురు దిగుమతులు వచ్చాయని స్పష్టం చేసింది.స్థిరంగా ధరలుగత నాలుగు సంవత్సరాలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 2022 నుంచి 2026 ఫిబ్రవరి మధ్య ఢిల్లీలో పెట్రోల్ ధర 0.67 శాతం తగ్గింది. ఇదే సమయంలో పాకిస్థాన్‌లో 55 శాతం, జర్మనీలో 22 శాతం మేర ధరలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. వినియోగదారులపై ధరల భారం పడకుండా పెట్రోల్, డీజిల్‌పై రూ.24,500 కోట్ల నష్టాలను, ఎల్‌పీజీపై రూ.40 వేల కోట్ల నష్టాలను ప్రభుత్వ సంస్థలు భరిస్తున్నాయని తెలిపింది. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశంలో ఏ ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఆయిల్ లేకుండా ఇబ్బంది పడలేదని పేర్కొంది. దేశీయంగా పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్న కారణంగా ఇప్పటి వరకు 44 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుకు ప్రత్యామ్నాయం అయినట్లు తెలిపింది.