. ఈ రెండు టీ20 వరల్డ్‌కప్‌లలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించాడు. ఇంకా కనీసం పదేళ్లు భారత జట్టుకు ఆడాలని, ఆ కాలంలో మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచి జట్టుకు అందించాలని సంకల్పం వ్యక్తం చేశాడు.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. అంతేకాదు, స్వదేశంలో ఈ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. అలాగే టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన తొలి జట్టుగా కూడా చరిత్ర సృష్టించింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో హార్దిక్ రెండు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు తొమ్మిది వికెట్లు కూడా తీశాడుఅహ్మదాబాద్‌లో విజయం అనంతరం హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన హార్దిక్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఇప్పుడు నేను జట్టులో సీనియర్ ప్లేయర్ అని వినిపించడం చాలా బాగుంది. కానీ నా దగ్గర ఇంకా పదేళ్ల క్రికెట్ మిగిలి ఉంది. ఇప్పటివరకు నా కెరీర్‌లో సగం మాత్రమే పూర్తయింది. ఇంకా సగం మిగిలే ఉంది. మొత్తంగా ఐసీసీ, ఐపీఎల్ కలిపి కనీసం మరో పది ట్రోఫీలు గెలవాలని నేను కోరుకుంటున్నాను” అని హార్దిక్ అన్నాడు. “నేను ఏ టోర్నమెంట్ ఆడినా గెలవాలనే ఆలోచనతోనే మైదానంలోకి దిగుతాను. వచ్చే పదేళ్లలో కచ్చితంగా ఐదు లేదా ఆరు ట్రోఫీలు అయినా గెలుస్తాను. ఓటమి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ విజయానికి దేవుడికి ధన్యవాదాలు” అని హార్దిక్ చెప్పాడు.ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి గురించి కూడా హార్దిక్ ప్రస్తావించాడు. తన గర్ల్‌ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ఆమె తన జీవితంలోకి వచ్చిన తర్వాత విజయాలు వరుసగా వస్తున్నాయని చెప్పాడు. “మహీకా నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను వరుసగా విజయాలు సాధిస్తున్నాను. నేను ఎప్పటినుంచో ఎదురు చూసిన విజయం ఇదే. అందుకే నేను క్రికెట్ ఆడుతున్నాను. ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం. ఎంత ఎక్కువ ట్రోఫీలు గెలిస్తే అంత మంచిది. 2024లోనే నేను ఒకసారి చెప్పాను, నేను ఆడే ప్రతి ట్రోఫీని గెలుస్తానని. నాకు ఇప్పటికీ ఆ నమ్మకం ఉంది” అని హార్దిక్ పేర్కొన్నాడు.