మహిళలకు ఫ్రీగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ప్రత్యేక శాలరీ అకౌంట్ తెచ్చిన బ్యాంక్

Wait 5 sec.

Yes bank: మహిళల కోసం స్పెషల్ శాలరీ అకౌంట్ ప్రారంభించినట్లు ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన యెస్ బ్యాంక్ ప్రకటించింది. పురస్కరించుకుని మహిళల ఆర్థిక, జీవన శైలి అవసరాలకు అనుగుణంగా ఈ ప్రత్యేక ఖాతాను రూపొందించినట్లు తెలిపింది. ద్వారా ఒకే ప్లాట్ ఫారంపైకి తీసుకువచ్చినట్లు యెస్ బ్యాంక్ తెలిపింది. యెస్ ఎసెన్స్ ఉమెన్స్ శాలరీ అకౌంట్లో మొదటి ఏడాది ఉచిత లాకర్ సౌకర్యం, ఏడాది పాటు రూ.5 లక్షల వరకు కాంప్లిమెంటరీ హెల్త్ కవర్ లభిస్తాయని తెలిపింది. వాటితో పాటుగా ఖాతాదారులకు కాంప్లిమెంటరీ ఎలిగెన్స్ డెబిట్ కార్డు సైతం లభిస్తుందని యెస్ బ్యాంక్ తెలిపింది. ఏడాదికి ఒకసారి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు సైతం ఈ ఖాతా ద్వారా అందిస్తున్నామని తెలిపింది. అలాగే డెబిట్ కార్డు ద్వారా ఎంపిక చేసిన విభాగాల్లో 5 శాతం క్యాష్ బ్యాక్ (ఏడాదికి రూ.6000 వరకు) పొందవచ్చని తెలిపింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఈ ప్రత్యేక ఖాతాను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాలని సూచించింది. మొదటి ఏడాది రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తున్నట్లు నొక్కి చెప్పింది. మహిళల కోసం రూ.4590 కోట్ల లోన్స్దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). మహిళల ఆర్థిక సాధికారత కోసం 500 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.4590 కోట్లు మేర సామాజిక రుణ సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. లింగ వివక్షను తగ్గించేందుకు, ఐక్యరాజ్య సమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది. పర్యావరణ, సామాజిక, పాలన సూత్రాలపై బ్యాంకుకు ఉన్న నిబద్ధతను ఇది సూచిస్తుందని పేర్కొంది. ప్రత్యేక హోమ్ లోన్మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఎల్ అండ్ టీ ఫైనాన్స్ సరికొత్త హోమ్ లోన్ స్కీమ్ తీసుకొచ్చింది. స్ఫూర్తి పేరుతో ఈ స్పెషల్ గృహ రుణ పథకాన్ని లాంచ్ చేసింది. హోమ్ లోన్స్ పై గరిష్ఠంగా 25 ఏళ్ల, పారిశ్రామిక ఆస్తుల హామీతో 12 ఏళ్ల వరకూ టెన్యూర్ వ్యవధితో ఈ రుణాలు అందిస్తున్నట్లు తెలిపింది. వ్యాపారంలో కనీసం 50 శాతం వాటా ఉండి, రూ.5 లక్షల వార్షిక లాభం పొందే మహిళలు ఈ రుణాలు పొందేందుకు అర్హులుగా పేర్కొంది. తక్కువ వడ్డీ రేట్లు, సడలించిన రూల్స్ తో రూ.75 లక్షల వరకు లోన్ పొందవచ్చని తెలిపింది.