కు ముందు ఇప్పుడు అత్యంత కీలకంగా మారనుంది. న్యూజిలాండ్ వంటి బలమైన జట్టును ఎదుర్కొనే ఈ మ్యాచ్‌లో సరైన కాంబినేషన్ ఎంపిక చేయడం భారత్‌కు అత్యంత అవసరం. ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.భారత్ బ్యాటింగ్ విభాగంలో ఎక్కువ మంది ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా సంజూ శాంసన్ నాలుగు మ్యాచ్‌ల్లో 232 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 263 పరుగులు చేశాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ 242 పరుగులతో జట్టుకు బలంగా నిలిచాడు. శివమ్ దూబే కూడా 209 పరుగులతో మంచి సహకారం అందించాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా - తిలక్ వర్మ కూడా ఈ టోర్నమెంట్‌లో 199 పరుగుల చొప్పున చేసి కీలకంగా మారారు.అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ టోర్నమెంట్‌లో అతను ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. టోర్నమెంట్ ప్రారంభంలో వరుసగా మూడు డక్స్ రావడం అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫుడ్ పొయిజనింగ్ కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా అతని ప్రదర్శనపై ప్రభావం చూపినట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా అతను పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో అతను కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఇక బౌలింగ్ విభాగంలో భారత్‌కు కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు 10 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాగే అర్ష్‌దీప్ సింగ్ 9 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అక్షర్ పటేల్ కూడా 8 వికెట్లతో స్థిరంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే వరల్డ్ నంబర్-1 టీ20 బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తి ఫామ్ మాత్రం టీమిండియాను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల మ్యాచ్‌ల్లో అతను అధిక పరుగులు ఇవ్వడం వల్ల ఫైనల్‌లో అతని స్థానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అహ్మదాబాద్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కూడా అతను ఎక్కువ సమయం ఒంటరిగా ప్రాక్టీస్ చేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో కొన్ని డెలివరీలు వేసిన తర్వాత అతను పక్కకు వెళ్లి కూర్చున్నాడు. ఇదే సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మ్యాచ్ పిచ్‌పై చర్చలు జరుపుతున్నట్లు కనిపించింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందనే చర్చలు మళ్లీ మొదలయ్యాయి. టీమిండియా జట్టు అంచనాఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి / కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.న్యూజిలాండ్ జట్టు అంచనాటిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ ఛాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్/జాకబ్ డప్ఫీ, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మెక్‌కానిచ్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్.