T20 World Cup: భారత్ - న్యూజిలాండ్ గ్రాండ్ ఫైనల్.. విజయ కేతనం ఎగురవేయాల్సిందే!

Wait 5 sec.

ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎపిసోడ్‌లు మినహాయించి మిగతా టోర్నీ మొత్తం గ్రాండ్ సక్సెస్ అనే చెప్పొచ్చు. పాకిస్తాన్ ఎలిమినేషన్‌తో సెమీఫైనల్ నుంచి మ్యాచ్‌లన్నీ భారత్ వేదికగానే జరిగాయి. ఇక గ్రాండ్ ఫైనల్ అహ్మదాబాద్ స్టేడియంలో ఆదివారంతో ముగియనుంది. సూపర్ 8లో ఒకే ఒక్క ఓటమి మినహా టీ20 వరల్డ్‌కప్ 2026 మొత్తం విజయ విహారం చేసిన టీమిండియా.. సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రసవత్తర పోరులో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ స్టేజ్‌లో సౌతాఫ్రికాపై ఓడిపోయి.. సెమీస్‌లో అదే సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్ ఫైనల్‌ బరిలో నిలిచింది. సూపర్ 8లో కూడా అంతంతమాత్రంగానే ఆడిన కివీస్.. సెమీఫైనల్‌లో వన్ సైడ్ విక్టరీతో గ్రాండ్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. భారత్ - న్యూజిలాండ్ మధ్య ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మార్చి 8, ఆదివారం జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి. సొంతగడ్డపై జరిగే ఈ టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకొని, విజయ కేతనం ఎగురవేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. 2024 టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నీలో అడుగుపెట్టి ఫైనల్‌లో నిలిచింది. అహ్మదాబాద్ సెంటిమెంట్‌ను పక్కనబెట్టి ఎలాగైనా మరోసారి విశ్వవిజేతగా నిలవాలని టీమిండియా ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు ఒక్క టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ కూడా లేని న్యూజిలాండ్ జట్టు ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా అవతరించాలని చూస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో ఇదే భారత్‌పై న్యూజిలాండ్ ఓటమిపాలయింది. ఇప్పటివరకు న్యూజిలాండ్ రెండుసార్లు ఐసీసీ టోర్నీ ఫైనల్‌లో విజేతగా నిలవగా.. ఆ రెండు కూడా భారత్‌పైనే గెలవడం విశేషం. 2000 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌నూ భారత్‌పైనే నెగ్గింది. దాంతో అహ్మదాబాద్‌లో జరిగే ఉత్కంఠభరితంగా మారనుంది.