కు ముందు అహ్మదాబాద్‌లో టీమిండియా నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో ఒక ఆసక్తికర మార్పు కనిపించింది. సాధారణంగా నెట్స్‌లో ముందుగా బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించే ఈసారి వెనుక నిలబడగా, అతని స్థానంలో ఎడమచేతి రిస్ట్ స్పిన్నర్ ముందుగా నెట్స్‌లోకి వెళ్లి తీవ్రంగా సాధన చేశాడు.భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ఒక రోజు ముందు అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ప్రాక్టీస్ సెషన్ జట్టు కాంబినేషన్‌పై చర్చలకు కారణమైంది. ముఖ్యంగా ఈ మార్పు ఫైనల్ ప్లేయింగ్ 11లో స్పిన్ విభాగంలో మార్పు జరగవచ్చనే సంకేతాలుగా భావిస్తున్నారు.ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్పిన్నర్‌గా ఉన్నప్పటికీ, ఈ టోర్నమెంట్‌లో ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా సూపర్-8 దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ తర్వాత అతని బౌలింగ్ మరింత దారుణంగా పతనమైంది. ఆ మ్యాచ్ నుంచి ప్రతి గేమ్‌లో అతను ఓవర్‌కు కనీసం తొమ్మిది పరుగులకుపైగా ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అతను తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన గణాంకాలు నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 64 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు.ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు వరుణ్ బౌలింగ్‌ను బాగా అర్థం చేసుకుని అతని చిన్న లెంగ్త్ డెలివరీలను సులభంగా భారీ షాట్లుగా మలిచారు. దాంతో వరుణ్ ఆత్మవిశ్వాసం తగ్గినట్లు కనిపించడం కూడా టీమిండియాపై ప్రభావం చూపింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ చివరికి గెలిచినా, మ్యాచ్ చాలా టెన్షన్‌గా మారింది. ముఖ్యంగా చివరి ఓవర్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన అద్భుతమైన డెత్ ఓవర్లు భారత్‌కు విజయం అందించాయి.ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో వరుణ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. గవాస్కర్ మాట్లాడుతూ “ఈ మ్యాచ్ కోసం నేను ఒక మార్పు ఆలోచిస్తాను. కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకురావడం మంచిదని భావిస్తున్నాను. వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. సూపర్-8 దశ నుంచి బలమైన జట్లను ఎదుర్కొన్నప్పుడు అతను ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు” అని తెలిపారు.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం గురించి కూడా గవాస్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అక్కడి పెద్ద బౌండరీలు స్పిన్నర్లకు కొంత సహాయపడతాయని, అలాంటి వేదికపై కుల్దీప్ యాదవ్ బంతిని బాగా తిప్పగలడని చెప్పాడు. “నరేంద్ర మోదీ స్టేడియం వంటి పెద్ద మైదానంలో కుల్దీప్ మంచి ఆప్షన్ కావచ్చు. ఫ్లాట్ పిచ్ ఉన్నా కూడా అతను బంతిని ఎక్కువగా తిప్పగలడు” అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో కుల్దీప్ యాదవ్ ఒకే మ్యాచ్ ఆడాడు. పాకిస్తాన్‌తో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో అతను మూడు ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.టీమిండియా జట్టు అంచనాఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.