: అంతర్జాతీయ రాజకీయ యవనికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్న సంకేతాలు ఇస్తూనే.. మిత్రదేశమైన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికా ఇప్పటికే విజయం సాధించిన యుద్ధంలోకి ఇప్పుడు బ్రిటన్ తన యుద్ధ విమాన వాహక నౌకలను పంపాల్సిన అవసరం లేదంటూ ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు.ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. "ఒకప్పుడు మా గొప్ప మిత్రదేశమైన యునైటెడ్ కింగ్‌డమ్.. ఇప్పుడు మధ్యప్రాచ్యానికి . సరే ప్రధాని స్టార్మర్.. కానీ ఇప్పుడు మాకు వాటితో అవసరం లేదు. అయితే ఈ విషయాన్ని (సమయం మించిపోయాక స్పందించడాన్ని) మేము గుర్తుంచుకుంటాం" అంటూ హెచ్చరికతో కూడిన చురకలు అంటించారు. అంతేకాకుండా అగ్రరాజ్యం ఒంటరిగానే శత్రువును మట్టికరిపించిందనే ధీమాను కూడా వ్యక్తం చేశారు."ఇరాన్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లూజర్"ఇరాన్ తన పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పిందని, ఇకపై దాడులు చేయబోమని హామీ ఇచ్చిందని ట్రంప్ వెల్లడించారు. "అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన కనికరం లేని దాడుల వల్లే ఇరాన్ ఈ నిర్ణయానికి వచ్చింది. వేల ఏళ్ల చరిత్రలో ఇరాన్ పొరుగు దేశాల చేతిలో ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లూ మధ్యప్రాచ్యంలో అందరినీ భయపెట్టే 'బుల్లీ'లా ఉన్న ఇరాన్.. ఇప్పుడు ఒక 'లూజర్' (ఓడిపోయిన దేశం)గా మారింది. ఆ దేశం పూర్తిగా కుప్పకూలిపోయే వరకు లేదా లొంగిపోయే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది" అని ట్రంప్ విశ్లేషించారు.ఇంతటితో ఆగకుండా జారీ చేశారు. ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే.. ఇప్పటి వరకు లక్ష్యంగా చేసుకోని ప్రాంతాలపై కూడా దాడులు చేస్తామని, అవి అత్యంత భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు. "నేడు ఇరాన్ చాలా గట్టి దెబ్బ తినబోతోంది. పూర్తి విధ్వంసం, మరణం తప్పవని గుర్తుంచుకోవాలి" అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన నాయకత్వంలోనే మధ్యప్రాచ్యం ప్రశాంతంగా మారుతోందని, ఇందుకు అందరూ తనకు 'థాంక్యూ' చెబుతున్నారని ట్రంప్ తనను తాను ప్రశంసించుకున్నారు.